Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి తర్వాత నమిత సినిమాలకు దూరం కాదు: వీరేంద్ర చౌదరి

తిరుపతిలో ప్రముఖ హీరోయిన్ నమిత వివాహం ఘనంగా జరిగింది. హీరో, నిర్మాత వీరేంద్ర చౌదరిని నమిత వివాహం చేసుకున్నారు. ఇస్కాన్ ఆలయంలో జరిగిన వివాహంలో తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన సినీప్రముఖులు హాజరయ్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (09:46 IST)
తిరుపతిలో ప్రముఖ హీరోయిన్ నమిత వివాహం ఘనంగా జరిగింది. హీరో, నిర్మాత వీరేంద్ర చౌదరిని నమిత వివాహం చేసుకున్నారు. ఇస్కాన్ ఆలయంలో జరిగిన వివాహంలో తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన సినీప్రముఖులు హాజరయ్యారు. నమిత, వీరేంద్ర చౌదరికి తమిళ బిగ్ బాస్ లో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమ చివరకు వివాహానికి దారితీసింది. ఈనెల 22వతేదీన తిరుపతిలో వివాహ లైట్ మ్యూజిక్ కార్యక్రమం జరిగింది.
 
ఈరోజు ఉదయం ఇస్కాన్ ఆలయంలో వీరేంద్ర చౌదరి, నమితలు వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటులు రాధికా, శరత్ కుమార్ తో పాటు పలువురు సినీప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. వివాహం అనంతరం మీడియాతో నూతన వధూవరులు మాట్లాడారు. 
 
వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నటి నమిత. నన్ను బాగా అర్థం చేసుకున్న వీరేంద్ర చౌదరిని పెళ్ళి చేసుకోవాలని నెల ముందే నిర్ణయించుకున్నాను. కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకున్నారు. తిరుపతి లాంటి ఆధ్మాత్మిక ప్రాంతంలో పెళ్ళి చేసుకోవడం మరింత సంతోషంగా ఉందన్నారు నమిత. మా వివాహం జరిగిన తరువాత కూడా నమిత సినిమాల్లో నటించవచ్చని, ఆమె ఇష్టానికి నేనెప్పుడు అడ్డురానన్నారు నటుడు, నిర్మాత వీరేంద్ర చౌదరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments