Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతికి రూ.140 కోట్లు బీమా.. సంజయ్ భన్సాలీ ముందు జాగ్రత్త

దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. భన్సాలీ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇండ

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (09:30 IST)
దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. భన్సాలీ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా, అంతర్జాతీయంగా పారామౌంట్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 
 
'పద్మావతి' సినిమా విడుదలకు యూకే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. డిసెంబర్ ఒకటో తేదీన విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఆ రోజున యూకేలో విడుదల చేయడానికి 'పద్మావతి' నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ఇండియన్ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు బ్రిటీష్ థియేటర్లలో సినిమాను విడుదల చేయబోమని వారు స్పష్టం చేశారు. దేశంలోనూ పద్మావతి సినిమాపై వివాదం జరుగుతూనే వుంది. 
 
దీపికా ప‌దుకునే న‌టించిన ''పద్మావతి'' సినిమాలో చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని, అది విడుద‌ల చేస్తే థియేట‌ర్లను త‌గుల‌బెడ‌తామ‌ని దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు హెచ్చ‌రిక‌లు చేస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ద‌ర్శ‌కుడు సంజ‌య్‌ భ‌న్సాలీ ముందే ఊహించినట్లున్నారు. అందుకే ఈ చిత్రానికి రూ.140 కోట్లతో బీమా చేయించారని సమాచారం. 
 
ఈ బీమా మొత్తంలో రూ.80కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు చెందుతుంది. ఈ సినిమాను ప్ర‌భుత్వం నిషేధిస్తే మాత్రం బీమా డ‌బ్బులు రావు. అలా కాకుండా సినిమా విడుద‌లై అల్ల‌ర్లు చెల‌రేగితే, భ‌యంతో థియేట‌ర్లకు ప్రేక్ష‌కులు రాక‌పోతే ఈ బీమా డబ్బులు వస్తాయి. ప‌ద్మావ‌తి సినిమాకు మహారాష్ట్రకు చెందిన బ్యాంకు బీమా కల్పించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments