Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున ఫల్గుణ లో అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటున్న శ్రీ‌విష్ణు

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:45 IST)
Arjuna Falguna-Sirvishnu
శ్రీ విష్ణు, జోహార్ ఫేమ్ తేజ మర్ని కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. అర్జున ఫల్గుణ అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను ఈరోజు  విడుదల చేశారు.
 
మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే. కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ఇదే విషయాన్ని టీజర్‌లో చూపించారు. ‘నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతోంది. 65  సెకన్ల టీజర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూపించారు.
 
డైలాగ్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందరినీ కట్టిపడేసేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది.
 
ఎన్ ఎమ్ పాషా సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు.
 
త్వరలోనే థియేటర్‌లోకి రానున్న ఈ సినిమాకు నిర్మాతలు  : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, సహ నిర్మాత :  ఎన్ ఎమ్ పాషా,  స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ :  తేజ మర్ని,  డైలాగ్స్ :  సుధీర్ వర్మ. పి, సినిమాటోగ్రపీ :  జగదీష్ చీకటి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments