Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక‌ట్టుకుంటోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ కోల్డ్ కేస్‌

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (19:21 IST)
Cold case
పృథ్వీరాజ్ సుకుమారన్‌, అదితి బాల‌న్, పూజా మోహ‌న్‌రాజ్‌, అనిల్ నెడుమంగ‌ద్‌, ల‌క్ష్మీ ప్రియ‌, చంద్రమౌళి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘కోల్డ్ కేస్‌’. ఈ శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 8) నుంచి ప్రీమియ‌ర్‌గా ఆహాలో ప్ర‌సార‌మ‌వుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌ల‌యాళంలో ‘కోల్డ్ కేస్‌’ అనే పేరుతోనే తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫ‌ర్ త‌ను బాల‌క్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించారు. శ్రీనాథ్ వి.నాథ్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో స్క్రీన్‌ను అతుక్కుపోయేలా చేసే రోల‌ర్ కోస్ట‌ర్ ‘కోల్డ్ కేస్‌’.
 
ఉత్కంఠ‌త స‌న్నివేశాల‌తో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన కోల్డ్ కేస్ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  ఓ స‌రస్సులో పుర్రె దొరుకుతుంది. అదెవ‌రిద‌నే విష‌యం పోలీసుల‌కు అంతు చిక్క‌దు. ఆ ర‌హస్యాన్ని చేదించ‌డానికి పోలీస్ క‌మీష‌న‌ర‌ల్ స‌త్య‌జిత్‌, జ‌ర్న‌లిస్ట్ మేథ చేసిన ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసుని చేధించ‌డానికి స‌త్య‌జిత్ ఏం చేశాడ‌నేదే క‌థ‌. జ‌ర్న‌లిస్ట్‌, సింగిల్ పేరెంట్ అయిన జ‌ర్న‌లిస్ట్ మేధ.. ఓ కొత్త ఇంటికి వెళుతుంది. ఆ ఇంట్లో అసాధార‌ణ‌మైన కొన్ని విష‌యాలు జ‌రుగుతాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేమంటే, అవ‌న్నీ స‌త్య‌జిత్ ప‌రిశోధిస్తున్న కేసుకి క‌నెక్ట్ అవుతాయి. మ‌రి ఈ ఇద్ద‌రు క‌లిసి అస‌లు ర‌హ‌స్యాన్ని చేధించారా, హ‌త్య చేయ‌బ‌డింది ఎవ‌రు? అనే విష‌యాన్ని తెలుసుకున్నారా? అనేదే సినిమా. 
 
క్రైమ్‌, థ్రిల్లర్‌, హార‌ర్‌, స‌స్పెన్స్ .. అంశాల‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేసి ‘కోల్డ్ కేస్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు అంద‌కుండా అనేక మ‌లుపులు తీసుకుంటూ సినిమా ముందుకు సాగుతుంది. పృథ్వీరాజ్, అదితి బాల‌న్ స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌ పెర్ఫామెన్స్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారింది. గిరీశ్ గంగాధ‌ర‌న్, టి.జాన్‌ సినిమాటోగ్ర‌ఫీ ఎడిట‌ర్ ష‌మీర్ ముహ‌మ్మ‌ద్ ప‌నితీరుతో క‌థ‌నాన్ని అద్భ‌తుంగా రూపొందించారు. ప్ర‌కాశ్ అలెక్స్ నేప‌థ్య సంగీతం ప్రేక్ష‌కుల‌ను ఓ మూడ్‌లోకి తీసుకెళుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments