Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకుంటోన్న అధర్వ ఫస్ట్ లుక్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:36 IST)
Karthik Raju
హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ.క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.   
 
మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్లు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో యాక్షన్‌లోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది.
 
ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్.
 
ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments