Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామీ.. సామీ పాటకు స్టెప్పులేసిన చిన్నారి.. వీడియో వైరల్

Advertiesment
Rashmika
, బుధవారం, 14 సెప్టెంబరు 2022 (14:16 IST)
Rashmika
పుష్ప సినిమాలోని "సామి.. సామి" పాటకు ఓ చిన్నారి ఆడిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప సినిమా బంపర్ హిట్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
 
తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పుష్ప రెండో భాగం మంచి కలెక్షన్లు, విమర్శకుల ప్రశంసలు అందుకోగా, రెండో భాగం శరవేగంగా సిద్ధమవుతోంది. 
 
ఈ సినిమాలోని "సామీ..సామీ" అనే పాట బాగా హిట్ అయ్యింది. ఈ పాటకు ప్రస్తుతం స్కూల్ స్టూడెంట్స్ డ్యాన్స్ వైరల్ అయ్యింది. ఇందులో ఓ చిన్నారి సామి డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వీడియో చూసిన తర్వాత, రష్మిక తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. "నేను ఈ అందమైన పడుచు పిల్లని కలవాలి. ఎలా కలవాలి?" అని అడిగి పోస్ట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్ మహారాజాతో అనుపమ పరమేశ్వరన్..