Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై హీరోయిన్ ప్రణీత కౌంటర్!

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (08:30 IST)
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. శరీర రంగు ఆధారంగా ఈశాన్య భారతానికి చెందిన ప్రజలను చైనీయులను, ఉత్తర భారతీయులను శ్వేతజాతీయులతోనూ, దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చుతూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారానికి దారితీశాయి. బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రణీత కూడా శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించారు. "నేను దక్షిణ భారతీయురాలిని.. భారతీయురాలిగానే కనిపిస్తున్నాను" అని తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. తాను దక్షిణ భారతం నుంచి వచ్చానని, భారతీయురాలిగానే కనిపిస్తున్నాని తెలిపారు. తన బృందంలో ఈశాన్య భారత్ నుంచి ఉత్సాహవంతమైన సభ్యులు ఉన్నారని, వారు భారతీయులులాగే కనిపిస్తున్నారు. జాత్యహంకారానికి మార్గదర్శి అయిన రాహుల్ గాంధీకి మనమంతా ఆఫ్రికన్, చైనీస్, అరబ్, వైట్‌గా కనిపిస్తామంటూ ఎద్దేవా చేశారు. 
 
దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు : శామ్ పిట్రోడా 
 
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వివాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఐక్యత గురించి వివరించే క్రమంలే ఆయన ఉపయోగించిన భాష పెను రాజకీయ దుమారానికి తెరతీసింది. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. 
 
ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు (ఈశాన్య) చైనీయుల్లా కనిపిస్తారు. దక్షిణ ప్రాంత ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు అని చెప్పారు. ఉత్తరాదివారు మాత్రం తెల్ల జాతీయుల్లా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయ. బీజేపీ నేతలు శామ్ పిట్రోడాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
మణిపూర్ ముఖ్యమంత్రి న్.బీరెన్ సింగ్, అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మత పాటు బీజేపీ నేతలు తప్పుబట్టారు. శామ్ భాయ్.. నేను దేశఁలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన వాడిని. నేను భారతీయుడిలా కనిపిస్తా. మేం చూసేందుకు భిన్నంగా కనిపించొచ్చు. కానీ, మేమంతా ఒక్కటే. దేశం గురించి కనీసం కొంచమైనా అర్థం చేసుకో అంటూ హిమంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
మరోవైపు, బాలీవుడ్ నటి, బీజేపీ మహిళా నేత కంగనా రనౌత్ కూడా శామ్ పిట్రోడాపై విరుచుకుపడ్డారు. "రాహుల్ గాంధీ మెంటర్ పిట్రోడా. భారతీయుల గురించి ఆయన చేసి జాతి విద్వేష, విభజన వ్యాఖ్యలు వినండి. వారి సిద్ధాంతమే దేశాన్ని విభజించి పాలించడం. సాటి భారతీయులను చైనీయులుగాను, ఆఫ్రికన్లుగా అభివర్ణించడం దారుణం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలి అటూ ఆమె ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై నోరు విప్పిన పవన్ కల్యాణ్... ఏమన్నారంటే?

ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే లేవు... తప్పుకుంటున్నాం : పేర్ని నాని

డొనాల్డ్ ట్రంప్ పేరిట కొత్త వైన్‌ను పరిచయం చేసిన ఇజ్రాయేల్

ఏపీలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకం..

రణరంగంగా జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ... ఎమ్మెల్యేల బాహాబాహీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments