Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లగా ఉన్నానని అతనితో డేటింగ్ చేస్తున్నానా? ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా నెటిజన్లపై ఫైర్ అయ్యింది. ఎక్కడికెళ్లినా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ గురించే అడుగుతున్నారని వాపోయింది. చాలామంది తన బాయ్‌ఫ్రెండ్ గురించి అడగటంలో తప్పులేదు కానీ.. అతని జాతి గురించి

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (13:54 IST)
గోవా బ్యూటీ ఇలియానా నెటిజన్లపై ఫైర్ అయ్యింది. ఎక్కడికెళ్లినా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ గురించే అడుగుతున్నారని వాపోయింది. చాలామంది తన బాయ్‌ఫ్రెండ్ గురించి అడగటంలో తప్పులేదు కానీ.. అతని జాతి గురించి అడుగుతున్నారని మండిపడింది. అతను తెల్లగా వున్నందువల్లే అతనితో తాను డేటింగ్ చేస్తున్నానని ఫైర్ అయ్యింది. అదొక్కటే తనకు నచ్చలేదని ఇలియానా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో తనకు వస్తున్న కామెంట్లపై స్పందించింది. తాను పబ్లిక్ ఫిగర్‌ అని.. అయితే పబ్లిక్‌ ప్రాపర్టీని మాత్రం కానేకాదని చెప్పేసింది. మిగిలిని పురుషులంతా తమ భార్యలు, తల్లుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తున్నారా? అని ప్రశ్నించింది. మరి తన విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించలేనని ఇల్లీ బ్యూటీ స్పష్టం చేసింది. 
 
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఇలియానా బర్ఫీ (2012) సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. ఆపై మేన్ తెరా హీరో, రస్తూమ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments