Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు భర్తగా అర్జున్ రెడ్డి.. మరి షాలిని పాండే సంగతేంటి?

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలోరూపొ

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (13:04 IST)
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ను సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలోరూపొందుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
 
సావిత్రి చిత్రంలో సమంత, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో ‘అర్జున్‌ రెడ్డి’ చిత్ర కథానాయిక షాలిని పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ‘అర్జున్‌ రెడ్డి’లో షాలిని నటన నచ్చేయడంతో సావిత్రిలో ఛాన్స్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో సావిత్రి భర్త, అలనాటి కథానాయకుడు జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
 
అంతేకాదండోయ్.. ఇక‌ అర్జున్ రెడ్డి చిత్రంతో బాగా పాపులర్ అయిన‌ విజయ్ దేవరకొండ.. సమంతకి భర్తగా ఇందులో కనిపించనున్నాడని టాక్ వస్తోంది. ఇదే సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్‌గా న‌టించిన షాలిని పాండే కూడా కీలక పాత్రకు ఎంపిక అయ్యిందని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments