Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు భాషల్లో ఇక్షు మూవీ విడుద‌ల‌

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (17:23 IST)
Ram Agnivesh
రామ్ అగ్నివేష్,  రాజీవ్ కనకాల, బాహుబలి ప్రభాకర్,  చిత్రం శీను వంటి ప్రముఖ తారాగణం రూపొందిన తాజా చిత్రం ఇక్షు. పద్మజ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై డా.హన్మంత్ రావు నాయుడు నిర్మించిన ఈ సినిమాకు వివి ఋషిక దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకోగా తాజాగా మొదటి ప్రీమియర్ ను కూడా ప్రదర్శించారు. బిజినెస్ కోసం వేసిన ఈ ప్రీమియర్ లో ఇక్షు సినిమాకి మంచి ఆదరణ లభించింది. 
 
దర్శకురాలు వివి ఋషికతో పాటు హీరో రామ్ అగ్నివేష్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ  సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేసిన  వివి ఋషిక  ఎంచుకున్న  కథకు సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. యువ నటుడు రామ్ అగ్నివేశ్ ఈ సినిమాతో  అరంగేట్రం చేసినప్పటికీ ప్రముఖ నటినటులతో సమానంగా నటించి వారితో ప్రశంసలు పొందారు. ఇక ఈ సినిమా తమిళ్, మలయాళం  ధియేటరికల్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం జీ5 సహా నెట్ఫ్లిక్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. మిగిలిన బిజినెస్ కార్యక్రమాలు అన్నీ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో ప్రెజెంటర్ గా సాయి కార్తీక్ గౌడ్ జాడి నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments