Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రుతిమించిన లేడీ విల‌నిజం - పిల్ల‌ల్లోనూ క్రూర‌త్వం పెంచుతున్నారంటూ రాజీవ్ సూటిప్ర‌శ్న‌

శ్రుతిమించిన లేడీ విల‌నిజం - పిల్ల‌ల్లోనూ క్రూర‌త్వం పెంచుతున్నారంటూ రాజీవ్ సూటిప్ర‌శ్న‌
, మంగళవారం, 2 నవంబరు 2021 (14:28 IST)
Intiguttu serial
సినిమాల‌లో హీరో, విల‌న్‌, క‌మేడియ‌న్లు ఇలా అంద‌రూ వుండి ప్రేక్ష‌కుడికి కాస్త ఆట‌విడుపు క‌లిగిస్తుంటారు. న‌చ్చితే చూస్తారు. లేదంటే ఆ సినిమా జోలికి పోరు. కానీ సీరియ‌ల్స్ అలా కాదు. న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ఎంత చెత్త‌గా వున్నా ఇంటిలో ప‌నిచేసుకునే మ‌హిళ‌ల‌కు కాస్త ఆట‌విడుపు అదే. అందుకే మ‌హిళ‌లు సీరియ‌ల్స్‌కు బానిస‌లైపోతున్నారు. అలాంటి సీరియ‌ల్స్ చెత్త చెత్త‌గా త‌యారై చూసే వాళ్ళ‌లో మ‌రింత చెత్త‌ను వారి మైండ్‌లోకి ఎక్కిస్తున్నారు. 
 
ముఖ్యంగా మ‌హిళ‌లే సీరియ‌ల్స్‌లో విల‌న్లు వుంటున్నారు. వారి పాత్ర‌ల డిజైన్ కూడా ఒక‌ర‌కంగా క్రూరంగా వుంటుంద‌నే చెప్పాలి. ఇటీవ‌లే ఇంటిగుట్టు అనే సీరియ‌ల్‌లో అత్త‌గారు కోడ‌లిని రాచిరంపాన పెట్ట‌డం, అదికూడా ఐస్‌గ‌డ్డ‌ల‌పై రోజంతా కోడ‌లిని నిలుచోపెట్ట‌డం వంటివి చూశాం. ఇప్పుడు ఆ కోడ‌లును బ‌య‌ట‌కు పంప‌డానికి పోలీసు అధికారి అయిన త‌న కొడుకు కు ఆల్‌రెడీ పెల్ల‌యి పిల్లాడు పుట్టాక వేరే వారితో వెళ్లిపోయిన మొద‌టి కోడ‌లుకు జ‌త క‌ట్టాల‌ని చూస్తుంటుంది. ఇలాంటి ఘోరాలు ఇందులో చాలానే వున్నాయి. పారిపోయి వ‌చ్చిన ఆ అమ్మాయి ఇప్పుడు మాజీ భ‌ర్త అయిన పోలీసు అధికారి కి భార్య‌గా వున్న మ‌రో అమ్మాయికి మాన‌సికంగా న‌ర‌కంగా చూపిస్తుంటుంది. అదెలా అనేది  బుల్లితెర‌పై చూడాల్సిందే. పైగా దీనికి ముందుగానే ప్రోమో... ఆమె వెళ్ళ‌గొట్టిందా! లేదా? అనే ప్ర‌చారం కూడా చేస్తున్నారు.
 
ఒక‌టిగాదు రెండుకాదు. తెలుగు టీవీ పేరుతో ప‌లు సీరియ‌ల్స్ అన్నీ ఇలాగే వున్నాయి. మ‌రో సీరియ‌ల్‌లో రాజ వంశంకు చెందిన క‌థ‌. పెద్ద‌కోడ‌లు అత్త‌గారిని బామ్మ‌గారికి, ఆఖ‌రికి మామ‌గారిని కూడా లెక్క‌చేయ‌కుండా మాట్లాడ‌డం. జిత్తుల మారి న‌క్క‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, మామ‌గారిని స్లో పాయిజ‌న్ ఇస్తూ, మ‌రిదిని ఎంక‌రేజ్ చేస్తూ అత‌డితో ఎఫైర్ పెట్టుకోవ‌డం. ఇలాంటివి  రోజూ ప‌రిపాటి అయ్యాయి. ఒక సీరియ‌ల్‌లో అత్త‌గారు విల‌న్ అయితే మ‌రో సీరియ‌ల్‌లో కోడ‌లు విలన్‌. ఇంకో సీరియ‌ల్‌లో తోబుట్టువే విల‌న్‌. మ‌రో సీరియ‌ల్‌లో లేడీ ఫ్రెండ్ విల‌న్‌. ఇలా అన్నీ విల‌న్లు మ‌గ‌వారే చేస్తే ఇక పురుషులు డ‌మ్మీగా మారిపోవ‌డం సీరియ‌ల్స్‌లో కామ‌న్ అయిపోయింది. ఇంకో సీరియ‌ల్‌లో.. భార్య‌గారూ అంటూ భ‌ర్త సంబోధించ‌డం. కేవ‌లం న‌లుగురికోసమే భ‌ర్త‌. అనేట్లుగా మాట్లాడ‌డం.. ఇన్ని ఘోరాలు చూడ‌లేక‌పోతున్నామంటూనే గ‌తిలేక చాలామంది ఆడ‌వాళ్ళు చూడ‌డం జ‌రుగుతునేవుంది.
 
webdunia
lady vilanizam
ఇదే విష‌యాన్ని రాజీవ్ క‌న‌కాల ఇటీవ‌లే సీరియ‌ల్స్ అవార్డు ఇవ్వ‌డానికి వ‌చ్చారు. వాటిల్లో ఉత్త‌మ కోడ‌లు, ఉత్త‌మ అత్త అవార్డులు ద‌క్కించుకున్న సంద‌ర్భంగా ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేతుల‌మీదుగా అందుకుంటుండ‌గా ఆయ‌న మ‌న‌సు చంపుకోలేక‌.. సీరియ‌ల్ అంటే లేడీసే విల‌న్లా. దీని ద్వారా మ‌హిళ‌లకు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారంటూ నిర్వాహ‌కుల‌ను ప్ర‌శ్నించారు. కానీ దానిని నిర్వాహ‌కులు స‌ర‌దాగా తీసుకోవ‌డం విశేషం. కానీ అనంత‌రం ఆయ‌న ఫంక్ష‌న్ అయ్యాక అక్క‌డి ముఖ్యుల‌తో మాట్లాడుతూ, ఇలాంటి క‌థ‌ల వ‌ల్ల మ‌హిళ‌లో లేనిపోని ఆలోచ‌న‌ల‌కు క్రియేట్ క‌లిగించిన‌వార‌వుతారు. అంటూ చెబుతుంటే, వారు తిరిగి చెప్పిన స‌మాధానం రాజీవ్‌కు షాక్ క‌లిగించింది. 
 
తిన్నామా, ప‌డుకున్నామా, తెల్లారిందా! ఇదే కావాలి. మీరు వ‌చ్చారా! అవార్డు ఇచ్చారా! వెళ్ళారా! అంత‌వ‌ర‌కు మీ ప‌ని. అన‌డంతో ఆయ‌న‌తోపాటు అక్క‌డివారు షాక్ అయ్యారు. దాంతో చిన్న‌బుచ్చుకున్న రాజీవ్ ఏదో ఫోన్ వ‌చ్చింద‌ని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇదీ ఛాన‌ల్స్ తీరు.. క‌నుక‌నే గ‌తంలో ప‌లువురు టీవీ సీరియ‌ల్స్‌కు సెన్సార్ వుండాల‌ని పోరాటాలు కూడా చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. సో. కాల‌మే దీనికి స‌మాధానం చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విష్ణుప్రియ భీమనేని... హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్