ఐఐఎఫ్ఐ అవార్డుల ప్రదానం... ఉత్తమ నటుడిగా హృతిక్ రోషన్

Webdunia
ఆదివారం, 28 మే 2023 (11:26 IST)
ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ ఐఫా 2023 అవార్డు ప్రధానోత్సవ వేడుకలు దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్‌ సినీ తారల అందాలు, అదిరే ప్రదర్శనల నడుమ వీటిని ప్రదానం చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంబరానికి బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, నోరాహి ఫతేహి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌ తదితర అందాల భామలు తమ నృత్యాలతో ఆహుతులను మైమరిపించారు. 
 
ఇకపోతే, ఈ యేడాది ఐఫా 2023 అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ ‌(విక్రమ్‌ వేద) సొంతం చేసుకోగా, గంగూబాయి కాఠియావాడి చిత్రంలో నటనకు గానూ అలియాభట్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక మిస్టరీ థ్రిల్లర్‌ 'దృశ్యం2' (హిందీ) ఉత్తమ చిత్రంగా నిలిచింది. అత్యధిక అవార్డులను 'బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1', 'గంగూబాయి కాఠియావాడి' చిత్రాలు దక్కించుకున్నాయి.
 
అలాగే అవుట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఫ్యాషన్‌ ఇన్‌ సినిమా అవార్డు మనీష్‌ మల్హోత్ర అందుకోగా, భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకుగానూ నటుడు కమల్‌హాసన్‌ అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు. అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ రీజినల్‌ సినిమా పురస్కారాన్ని రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంపతులు అందుకున్నారు. అలియా భట్‌ ఈ అవార్డుల వేడుకకు హాజరుకాలేదు. దీంతో ఉత్తమ నటి అవార్డును ఆమె తరపున నిర్మాత జయంతిలాల్‌ స్వీకరించారు.
 
ఐఫా 2023 అవార్డుల విజేతలు వీళ్లే 
ఉత్తమ నటుడు : హృతిక్‌ రోషన్‌ (విక్రమ్‌ వేద)
ఉత్తమ నటి : అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
ఉత్తమ సహాయ నటుడు : అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)
ఉత్తమ సహాయనటి : మౌనీ రాయ్‌(బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
ఉత్తమ దర్శకుడు : ఆర్‌.మాధవన్‌ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌)
ఉత్తమ చిత్రం : దృశ్యం2
ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
ఉత్తమ గీత రచయిత : అమిత్‌ భట్టాచార్య (కేసరియా:  బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ స్క్రీన్‌ప్లే : గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ సంభాషణలు : గంగూబాయి కాఠియావాడి
ఉత్తమ కొరియోగ్రఫీ : భూల్‌ భూలయా2
ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ : భూల్‌ భూలయా 2
ఉత్తమ ఎడిటింగ్‌ : దృశ్యం2
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1
ఉత్తమ నేపథ్య సంగీతం : విక్రమ్‌ వేద
ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ : మోనికా ఓ మై డార్లింగ్‌
ఉత్తమ తొలి చిత్ర నటుడు : శంతను మహేశ్వరి (గంగూబాయి కాఠియావాడి), బబ్లీ ఖాన్‌(ఖులా)(ఇద్దరి మధ్య టై అయింది)
ఉత్తమ తొలి చిత్ర నటి : కుషాలీ కుమార్‌ (దోఖా: రౌండ్‌ డి కార్నర్‌) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments