Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

దేవీ
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (19:29 IST)
Vennela Kishore, Priyadarshi, Rupa Koduvayur, Indraganti, siva prasad
ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం "సారంగపాణి జాతకం". ఇంద్రగంటి మోహనకృష్ణ - శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరేవేగంగా సాగుతున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూపా కొడవాయూర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్,  ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన వెన్నెల కిషోర్, వైవా హర్ష, సాయి శ్రీనివాస్ వడ్లమాని, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్  పాల్గొన్నారు.
 
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా 25 తేదీన రిలీజ్ అవుతున్నది.  జెంటిల్మన్, సమ్మోహనం తర్వాత మోహన్ కృష్ణతో మరోసారి సినిమా చేశాను.  ఈ సినిమా అవుట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా హిట్ కావడం గ్యారెంటీ. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, వడ్లమాని శ్రీనివాస్, వీకే నరేష్ ఈ సినిమాకు అస్సెట్. ఓ మంచి ఫ్యామిలీ సినిమాను డెలివరీ చేస్తున్నాం అని అన్నారు. 
 
హీరోయిన్ రూపా మాట్లాడుతూ.. సారంగపాణి జాతకం గురించి చెప్పాలంటే.. నేను స్వతహాగా జాతకాలు నమ్మను.కానీ ఈ సినిమా చేసిన తర్వాత జాతకాలను నమ్మడం మొదలుపెట్టాను. విజయవాడలో డాక్టర్‌గా పనిచేసుకొందామంటే.. నన్ను యాక్టర్ చేశారు. సారంగపాణి జీవితంలో ట్విస్టులు ఈ సినిమాలో వినోదాన్ని పండిస్తుంది. సారంగపాణి జాతకంతో ప్రియదర్శి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. దర్శకుడు ఇంద్రగంటి బంగారం లాంటి వారు. తెలుగు భాష పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చెప్పలేం. ఆయన సినిమాలో నటించడం గర్వంగా భావిస్తున్నాం అని అన్నారు. 
 
దర్శకుడు  ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ.. సారంగపాణి జాతకం సినిమా కామెడీ, క్రైమ్ చిత్రం. క్రైమ్ అంశంతో కామెడీ సినిమాను అందించాం. నిర్మాత కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రోత్సాహం అందించారు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన చిత్రం. మీడియా వల్ల నా సినిమాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ సినిమాను కూడా మీడియా వీలైనంత మేరకు ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రమోట్ చేయాలని కోరుకొంటున్నాను. కేవలం తెలుగు నటీనటులు నటించిన అచ్చ తెలుగు సినిమా సారంగపాణి జాతకం. మిమ్మల్ని అన్ని రకాలుగా మెప్పిస్తుంది అని అన్నారు.
 
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇంద్రగంటి గారితో పనిచేయాలనే కోరిక నెరవేరింది. ఈ టీమ్‌తో మరోసారి వర్క్ చేయాలనే కోరిక కలిగింది. మంచి టీమ్‌తో ఈ సినిమా రూపొందింది. మండు వేసవిలో చల్లని ప్రశాంతమైన వాతావరణం కలిగితే ఎంత ఆనందం ఉంటుందో.. ఈ సినిమా కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. వినోదంతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా థియేటర్‌లో చూడండి. 25వ తేదీన మిమ్మల్ని నేను థియేటర్‌లో కలుస్తాను. నేను ఎప్పుడూ మంచి సినిమా అందించేందుకు ప్రయత్నిస్తున్నాను అని అన్నారు..
 
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..” పుష్పక విమానం‘  టాకీ గా వస్తే ఎలా ఉంటుందో , ఈ ‘సారంగపాణి జాతకం‘ అలా ఉంటుంది . నిర్మాత కృష్ణ ప్రసాద్ గారు గుడ్ కాప్. దర్శి ‘కోర్టు’ విజయం తర్వాత డాషింగ్‌గా కనిపిస్తున్నారు. హీరోయిన్ రూపా మంచి టాలెంటెడ్ నటి. ఈ సినిమా పూర్తి వినోద భరిత చిత్రం. ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి థియేటర్‌లో చూడండి” అని అన్నారు.
 
వైవా హర్ష మాట్లాడుతూ.. శ్రీదేవీ మూవీస్ యూనివర్సిటీ లాంటింది. కృష్ణ ప్రసాద్ డీన్ లాంటి వ్యక్తి. ఇంద్రగంటి నా ఫేవరేట్ లెక్చరర్. నా క్లాస్ మేట్‌లో దర్శి, రూపా. నా కాలేజీలో సీనియర్ స్టూడెంట్ వెన్నెల కిషోర్ గారు. ఈ సినిమాలో నటించడం వల్ల లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పడింది. ఈ సినిమా 25వ తేదీన రిలీజ్ అవుతుంది. వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులందరూ థియేటర్‌లో చూసి ఆనందించండి అని అన్నారు. 
 
వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడుతూ..  సారంగపాణి చిత్రంలో ప్రియదర్శికి తండ్రిగా నటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణకు రుణపడి ఉంటాను. తెగిపడుతున్న చేతులు, ఊడిపడుతున్న కనుగుడ్లు లాంటి సినిమాల మధ్య మంచి వినోద భరిత చిత్రాన్ని ఆయన అందిస్తున్నాడు. పరభాష నటులు లేకుండా అంతా తెలుగు నటీనటులు నటించిన చిత్రం. తండ్రి పాత్రతో నాకు నటుడిగా ప్రమోషన్ కల్పించిన ఇంద్రగంటికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments