బాహుబలి వంటి సినిమాలో పనిచేసేందుకు అవసరమనుకుంటే ప్రాణాలైనా ఇస్తా: తమన్నా
బాహుబలి బిగినింగ్ లాంటి చిత్రంలో అవకాశం లభించడంపై తమన్నా నోరు విప్పింది. బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించడానికి దేనికైనా సిద్ధమని తమన్నా చెప్పింది. ఆ సినిమాలో నటించడమంతా కలలాగా జరిగిపోయింది
బాహుబలి బిగినింగ్ లాంటి చిత్రంలో అవకాశం లభించడంపై తమన్నా నోరు విప్పింది. బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించడానికి దేనికైనా సిద్ధమని తమన్నా చెప్పింది. ఆ సినిమాలో నటించడమంతా కలలాగా జరిగిపోయింది. 'బాహుబలి'లో అవకాశం.. తన కెరీర్‌లో అనుకోకుండా జరిగిన సంఘటన. అంతకుముందు కొన్ని వరుస వైఫల్యాలతో ఉన్న తాను ఈ ప్రాజెక్టులో భాగం కావడం అంటే వూహకందని విషయమేనని తెలిపింది.
రెండోభాగంలో తనది చాలా మంచి పాత్ర. ఇంకా చిత్రీకరించాల్సిన భాగం కొంత ఉంది. డిసెంబరుతో షూటింగ్ పూర్తవుతుందని తమన్నా చెప్పుకొచ్చింది. బాహుబలి వంటి గొప్ప ప్రాజెక్టులో పనిచేసేందుకు అవసరమనుకుంటే ప్రాణాలైనా ఇవ్వగలనని తమన్నా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రంలో తమన్నా అవంతిక పాత్రలో కనిపించి మెప్పించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్'ని తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నాతోపాటు ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.