నేను యూ ట్యూబ్ ఛానెల్ మొదలుపెడతానంటున్న నభా నటేష్

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (22:58 IST)
'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమై, గతేడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో రామ్ సరసన ఒక హీరోయిన్‌గా నటించిన నభా నటేష్ ఈ ఏడాదిలో చివరగా రవితేజతో కలిసి 'డిస్కో రాజా'లో హీరోయిన్‌గా నటించింది.
 
అయితే, కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు వాయిదాపడటంతో ఇంటికే పరిమితమైన నభా నటేష్ తన అందచందాలను కాపాడుకునేందుకు ఇంటి చిట్కాలను పాటిస్తుంది. ముఖం మరింత అందంగా మారడానికి, జుట్టు బాగా పెరగడానికి, కళ్ల క్రింద నలుపు రంగు పోవడానికి, కాళ్ల పగుళ్లు, బరువు పెరగకుండా ఉండటానికి లాక్‌డౌన్‌లో చాలా చిట్కాలను పాటించింది.
 
ఈ చిట్కాలు తనకు మంచి ఫలితాన్ని ఇచ్చినందున ఫ్యాన్స్ నుండి ఆమెకు భారీ సంఖ్యలో రిక్వెస్ట్‌లు వచ్చాయని తెలిపింది. సోషల్ మీడియా ద్వారా ఈ చిట్కాలను తమకు కూడా చెప్పాలని చాలా మంది అమ్మాయిలు నభాను కోరారట. వారి అభ్యర్థన మేరకు తాను త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేయనుందట. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆ యూట్యూబ్ ఛానెల్‌లో పెడతానని నభా నటేష్ చెబుతోంది. పార్ట్ టైమ్‌గా ఫ్యాన్స్ కోసం కొన్నాళ్లపాటు బ్యూటీ టిప్స్‌ను అందిస్తానని ఆమె పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments