Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు థియేటర్లు ఓపెన్ చేయడం రిస్క్‌తో కూడుకున్న పని : నిర్మాత సురేష్

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:09 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనేవుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. దీనిపై ప్రముఖ నిర్మాత దగ్గుబాట సురేష్ స్పందించారు. కేసులు పెరుగుతున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల రీఓపెన్ రిస్క్‌తో కూడుకున్న ప‌ని అని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100కిపైగా థియేట‌ర్ల‌ను లీజుకు తీసుకున్న అగ్ర‌నిర్మాత సురేశ్ బాబు ఇప్ప‌డ‌ప్పుడే థియేట‌ర్ల‌ను రీఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇటువంటి సమయంలో థియేట‌ర్లు ఓపెన్ చేయ‌డం రిస్క్‌తో కూడిన ప‌ని. థియేట‌ర్ల‌లో 3 గంట‌ల‌పాటు ఉండి.. జీవితాల‌ను రిస్క్‌లో పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని, ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు. 
 
క‌రోనా కేసులు త‌గ్గిన త‌ర్వాత చైనాలో థియేట‌ర్లు ఓపెన్ చేశారు. కానీ వారు మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను మూసివేశారు. దీన్ని మ‌న‌మంతా ఓ ఉదాహ‌ర‌ణగా తీసుకోవాల‌ని, వ్యాపార దృక్పథంతో ఆలోచించొద్దని కోరారు. ఇలాంటి సమయంలో లో ప్ర‌భుత్వం థియేట‌ర్లు రీఓపెన్ చేసుకునే అవ‌కాశ‌మిస్తుంద‌ని తాను అనుకోవ‌డం లేదని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు.
 
కాగా, ఈ నెలాఖరుతో ప్రస్తుతం అమల్లో వున్న అల్‌లాక్ 2.0 ముగియనుంది. అన్‌‌లాక్ 3.0లో భాగంగా సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వొచ్చన్న ప్రచారం సాగుతోంది. థియేటర్లలో సామాజిక దూరం పాటిస్తూ, ప్రేక్షకుల భద్రతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటామని, ఆన్‌లైన్ విధానంలో టిక్కెట్లు విక్రయిస్తూ, ఒక షోకు మరో ఆటకు మధ్య అర్థగంట సమయం ఉండేలా చూసుకుంటామని థియేటర్ల యజమానులు హామీ ఇస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments