నేను ఎప్పుడైనా కూడా నా మనసుకు నచ్చిందే చేశాను. నేను ఓ స్మార్ట్ ప్రొడ్యూసర్‌ని కాకపోవచ్చు.. నాకు బిజినెస్ గురించి అంతగా తెలియకపోవచ్చు.. కానీ ఈ సినిమాను నా మనసుకు నచ్చింది కాబట్టి చేశాను. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని మాత్రం చెప్పగలను అని నటి సమంత అన్నారు.
సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం శుభం. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో పలు విషయాలు ముచ్చటించారు.
- ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అని అనుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు అని అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్దతిని మాత్రం నేను ఎంకరేజ్ చేయలేను.
- ప్రస్తుతం నేను మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని చేస్తున్నాను. జూన్ నుంచి మళ్లీ షూట్‌కు వెళ్తున్నాం. షూట్ స్టార్ట్ అయ్యాక మళ్లీ అప్డేట్లు వస్తుంటాయి. అట్లీ గారితో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. భవిష్యత్తులో మేం ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి.