కన్న కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు... ఖుష్బూ సెన్సేషనల్ కామెంట్స్

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (10:52 IST)
ప్రముఖ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. బాల్యంలో తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు వెల్లడించింది. ఎనిమిదేళ్ళ వయసులో తనకు ఈ వేధింపులు ఎదురైనట్టు చెప్పారు. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని చెప్పారు. ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
'ఒక అబ్బాయి లేదా అమ్మాయి చిన్నతనంలో వేధింపులకు గురైతే.. అది వాళ్లను జీవితాంతం భయానికి గురిచేస్తుంది. తన భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే.. ఏం జరిగినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురుతిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలివెళ్లిపోయాడు. ఆ సమయంలో మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం' అని ఖుష్బూ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం