Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించడమే నా కల : సోనూ సూద్

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (13:49 IST)
కరోనా కష్టకాలంలో నిజమైన హీరోగా ఉన్న వెండితెర విలన్ సోనూ సూద్ తన కలను వెల్లడించారు. అందరికీ ఉచిత వైద్యం అందించేలా ఆస్పత్రులు ఏర్పాటు చేయడమే తన కల వెల్లడించారు. 
 
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది సామాన్య ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇచ్చి.. తన వంతు సాయం అందిస్తున్న సోనూసూద్‌ తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి స్పందించారు.
 
'కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లను చూసి నా మనసు చెలించిపోయింది. చేతనైనంత సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఈ సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం మొత్తం నాకు అండగా ఉంది. నా భార్య, పిల్లల సోషల్‌ మీడియా ఖాతాలకు సైతం సాయం కోరుతూ ఎంతోమంది మెస్సేజ్‌లు పంపుతున్నారు. 
 
వాటిని చూసిన వెంటనే వాళ్లు నాకు చెబుతున్నారు. అలా వాళ్లు కూడా నాకు సపోర్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేలా పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ఉంది. కానీ, అది ఇప్పుడే సాధ్యం కాని పని. ఉచిత వైద్యం అందించేలా ఆస్పత్రులు మాత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తప్పకుండా అది చేస్తాను అని సోను చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments