Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశం కోసం ఎదురుచూశాను - సుమంత్.

Webdunia
శనివారం, 9 జులై 2022 (18:13 IST)
Sumanth
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సీతా రామం'. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా,  రష్మిక మందన్న కీలక పాత్రలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి మరో బిగ్ సర్ ప్రైజ్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
 
ఫస్ట్ లుక్ లో ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సుమంత్. సాఫ్ట్, క్లాస్ పాత్రలలో కనిపించే సుమంత్ ..  బ్రిగేడియర్ విష్ణు శర్మగా టెర్రిఫిక్ లుక్ లో కనిపించారు. ఆర్మీ దుస్తుల్లో మెలితిరిగిన మీసాలతో సీరియస్ గా చూస్తున్న సుమంత్ మేకోవర్ సరికొత్తగా ఆకట్టుకుంది. ఈ సంద‌ర్భంగా సుమంత్‌తో జ‌రిపిన ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
తొలిసారి ఒక సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు కదా..  బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో మీకు అంతలా నచ్చిన అంశాలు ఏమిటి ?
 
నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్ చేస్తానని ఎప్పటినుండో చెబుతున్నాను.  మంచి పాత్రలు, అవకాశం కోసం ఎదురుచూశాను. బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా క్లిష్టమైన పాత్ర. చాలా కోణాలు వుంటాయి. కథకి చాలా కీలకమైన పాత్ర. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత అద్భుతం అనిపించింది. ఇలాంటి పాత్రలు సాదారణంగా రావు. ఇది నెగిటివ్ పాత్ర కాదు. కానీ చాలా వైవిధ్యంగా వుంటుంది. ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఆ సవాల్ నచ్చే ఒప్పుకున్నా. 
 
ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో విడుదలౌతుంది కదా.. మిగతా భాషల్లో ఇది మీకు ఇంట్రడ్యుసింగ్ సినిమా గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారా ?
తప్పకుండా. ఈ సినిమా పాత్ర పరిచయానికి తమిళ్ లో  నేనే డబ్బింగ్ చెప్పాను. మిగతా భాషల్లో కూడా ఈ చిత్రం నాకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నా.
 
 బ్రిగేడియర్ విష్ణు శర్మ లుక్ లో మీసాలతో మీ తాతగారిని గుర్తు చేస్తుంది. మీకు అలా అనిపించిందా ?
చిన్నప్పటి నుండి నాకు తాతగారి పోలికలు వున్నాయని అందరూ చెబుతారు. అది నా అదృష్టం. నేను మా అమ్మలా వుంటాను. మా అమ్మ మా తాతయ్యలా వుంటుంది. (నవ్వుతూ) . ఆయన పోలికలు రావడం నిజంగా నా అదృష్టం.
 
వైజయంతి మూవీస్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
వైజయంతి మూవీస్ ఒక క్లాసిక్ ఎపిక్ బ్యానర్. అశ్వినీదత్ గారితో ఎప్పటినుండో పరిచయం, చనువు వుంది. దత్ గారు సినిమాలో నా రషెస్ చూసి మా నాన్నగారికి ఫోన్ చేసి అద్భుతంగా చేశాడని చెప్పారు. వైజయంతిలో పని చేయడం గొప్ప అనుభవం. 
 
వెబ్ సిరిస్ ల ట్రెండ్ పెరిగిందికదా.. వెబ్ సిరిస్ చేసే ఆలోచన ఉందా ?
ఒక నటుడిగా అన్నీ చేయాలనీ వుంటుంది. కొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే మంచి అవకాశం చూస్తున్నాను. ఓటీటీలో భిన్నమైన కథలు చెప్పే అవకాశం వుంటుంది. సవాల్ తో కూడిన కథలు వుంటాయి. నాకు నచ్చిన కథ కుదిరిరితే తప్పకుండా చేస్తా.

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments