Dulquer Salman, Mrinalini Thakur
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా యుద్ధం నేపధ్యంలో ఓ అందమైన ప్రేమకథ '' సీతా రామం' చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్ 'ఓ సీతా- హే రామా' పాట విడుదల చేశారు. ఈ పాట సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ప్లజంట్ ట్రాక్ గా నిలిచింది.
ఓ.. సీతా.. వదలనిక తోడౌతా.. రోజంతా వెలుగులిడు నీడవుతా.. నుదుట తిలకమై వాలుత. అంటూ అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలో వినిపించిన ఈ సాహిత్యం '' సీతా రామం' ప్రేమకథలో మాధుర్యాన్ని అందంగా చెప్పాయి.
ఎస్పీ చరణ్, రమ్య బెహరా పాటని అద్భుతంగా ఆలపించారు. వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ మ్యూజికల్ మోమోరీస్ ని ఈ పాట గుర్తుకు తెచ్చింది. ఆడియన్స్ లూప్ మోడ్ లో పెట్టుకొని మళ్ళీమళ్ళీ వినే చార్ట్ బస్టర్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంది.
పాటలో కనిపించిన విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. దుల్కర్, మృణాల్ మధ్య కెమిస్ట్రీ బ్యుటిఫుల్ గా వుంది. పాటలో మ్యూజిక్ మేకింగ్ కూడా చూపించారు. పెద్ద వయోలిన్ ట్రూప్ తో గ్రాండ్ సింఫనీ ఆర్గనైజ్ చేసి ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో నిర్మాతలు ప్రత్యేక ద్రుష్టి పెట్టి అద్భుతమైన ఆల్బమ్ ని ప్రేక్షకులకు వినిపించే లక్ష్యంతో వున్నారని ఫస్ట్ సింగల్ రికార్డింగ్ చూస్తే అర్ధమౌతుంది.
ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న అఫ్రీన్ అనే కీలకమైన పాత్ర పోషిస్తుంది.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.