Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్స్ లేన‌ప్పుడు పుస్త‌కాలు చ‌దువుతాను. ఫ్యామిలీతో గ‌డుపుతా : మ‌నోజ్ బాజ్‌పాయి

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (18:51 IST)
Manoj Bajpayee
ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన కూడా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు పొందిన న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ ఒరిజిన‌ల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భ‌న్సాలి స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై వినోద్ భన్సాలి, క‌మ‌లేష్ భ‌న్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ క‌ర్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, త‌మిళంలోనూ రిలీజ్ చేయ‌గా అమేజింగ్ ర‌స్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ..‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు..
 
* ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మేం ఎవ్వ‌రం ముందుగా ఊహించ‌లేదు. అయితే ఓ మంచి సినిమాను చేయాల‌ని మేం భావించాం. అందులో భాగంగా అంద‌రం ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. అలాగే ఆ దేవుడు ద‌య కూడా తోడు కావటంతో ఓ  మంచి సినిమాను అందించామ‌ని భావిస్తున్నాను. 
 
* ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రానికి ఆడియెన్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. కొంద‌రైతే రెండు, మూడు సార్లు చూస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌న‌యితే రిపీట్‌గా చూస్తున్నారు. 
 
*మా డైరెక్ట‌ర్ అపూర్వ‌సింగ్ క‌ర్కి అయితే క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ కోస‌మైతే మూడు నాలుగు కెమెరాలు పెట్టారు. సింగిల్ టేక్‌లో ఏడు పేజీలున్న మోనోలాగ్‌ను కంప్లీట్ చేయాల‌ని నాతో అన్నారు. అందుకోసం నాకు రెండు రోజుల స‌మయం కూడా ఇచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే సింగిల్ టేక్‌లో పూర్తి చేయాల‌నుకుని నేను వాటిని నేర్చుకుని రెండు రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేసి చేశాను. ఇప్పుడు చూస్తుంటే వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది. 
 
*ఈ చిత్రంలో నేను చేసిన సోలంకి  అనే లాయ‌ర్ పాత్ర కామ‌న్ మ్యాన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అందుక‌నే ఆ పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలున్నప్ప‌టికీ దాన్ని చిరున‌వ్వుతో ఎదుర్కొనే సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంద‌రికీ ఈ పాత్ర ఓ ఉదాహ‌ర‌ణ‌. 
 
* సోలంకి పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. అందుక‌నే మంచి అప్రిషియేష‌న్స్ వ‌స్తున్నాయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కాన్సెప్ట్‌ను మ‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌లు నిజ ఘ‌ట‌న‌ల‌ల‌ను ఆధారంగా  త‌యారు చేశాం. అయితే ప్ర‌ధానంగా ఈ  సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె త‌న జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను చూపించాం. అలాగే  ఆమెకు, సోలంకితో ఉన్న ఓ మంచి అనుబంధాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశాం. 
 
* ఏ ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌కైనా న్యాయ వ్య‌వ‌స్థే మూల‌స్తంభంలాంటిది. అందుక‌నే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రాన్ని లాయ‌ర్స్‌కి, న్యాయ వ్య‌వ‌స్థ‌కి అందించిన నివాళిగా భావిస్తున్నాం. 
 
* సోలంకి పాత్ర‌లో న‌టించ‌టానికి చాలా హోం వ‌ర్క్ చేశాను. స్క్రిప్ట్ మొత్తం ప‌దే ప‌దే చ‌దివాను. ముఖ్యంగా లాయ‌ర్ రోల్ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంది.. మాట్లాడుతుంది ..ఇలా ప్ర‌తీ చిన్న విష‌యాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాను. నాకు నేనుగా ఆ పాత్ర‌కు మ‌న‌సులో ఓ రూపంలో క్రియేట్ చేసుకుని దాన్ని ప్రొజెక్ట్ చేశాను 
 
* హిందీలో అయితే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ఓ హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ముందు ఓటీటీలో విడుద‌లైన త‌ర్వాత ప్రేక్షుల రిక్వెస్ట్ మేర‌కు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు స‌హా ఇత‌ర రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశాం. దాన్ని అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. 
 
* జీ 5 వారు ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాను చూడ‌గానే న‌చ్చింది. అందుక‌నే వారు దాన్ని ఓటీటీలో వీలైనంత ఎక్కువ మందికి రీచ్ చేయించాల‌ని ప్ర‌య‌త్నించారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగు, త‌మిళ‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. 
 
* ఇప్పటి వరకు మన సినిమాల్లో చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ వచ్చాయి. మా సినిమా విషయానికి వచ్చేసరికి మేం లార్జర్‌దేన్ లైఫ్‌గా చేయాల‌నుకోలేదు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చూపించాల‌నుకున్నాం. దీన్ని ఒక క‌మ‌ర్షియ‌ల్ మూవీగా కూడా చేసి ఉండొచ్చు. కానీ.. మేం అలా చేయాల‌నుకోలేదు. ఓ ఎక్స్‌పెరిమెంట్‌లాగానే చేశాం. ఆ ప్ర‌య‌త్నం వ‌ల్ల‌నే బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా అంద‌రూ చెబుతున్నారు. 
 
* ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రంలో నేను కాకుండా మ‌రో తెలుగు న‌టుడు ఎవ‌రైతే బావుంటుంద‌ని ఆలోచిస్తే.. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాయ‌ర్‌గా చేసి మెప్పించారు. మ‌హేష్ బాబు అయితే ఈ పాత్ర‌కు సూట్ అవుతార‌నిపిస్తోంది. 
 
* రీసెంట్‌గా నేను ఆర్ఆర్ఆర్ మూవీనే చూశాను. అది కాకుండా ఇండిపెండెంట్ మూవీస్ ఎక్కువ‌గా చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. చూస్తుంటాను కూడా. సినిమా షూటింగ్స్ లేన‌ప్పుడు పుస్త‌కాలు చ‌దువుతుంటాను. ఫ్యామిలీతో గ‌డుపుతుంటాను. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు రాయ‌ల‌సీమ రుచులుకి వెళుతుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ‌గా స్పైసీ ఫుడ్‌ను ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే బిర్యానీని కూడా ఇష్టంగా తింటాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అయ్య బాబోయ్..అదానీ గ్రూప్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోలేదు.. వైకాపా

అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments