Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విడుదలకు సిద్దమైన శ్రీవిష్ణు నటించిన సామజవరగమన

Sri Vishnu, Reba Monica John
, సోమవారం, 12 జూన్ 2023 (16:47 IST)
Sri Vishnu, Reba Monica John
హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన' తో హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా వున్నారు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్, ఇతర ప్రమోషనల్ స్టప్ స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేసి క్యూరియాసిటీ పెంచాయి. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.
 
ఈరోజు, మేకర్స్ ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీ తో ముందుకు వచ్చారు. జూన్ 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సామజవరగమన నవ్వులు పూయించనుంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ అలరించింది.
 
గోపీ సుందర్ సంగీతం అందించిన ఫస్ట్  సింగిల్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలను చైతన్య వంతులను చేసే దర్శకుల్లో మధుసూదనరావు గారు ముందంటారు