Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

దేవీ
గురువారం, 27 మార్చి 2025 (18:09 IST)
NTR- Japan fan
ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తరువాత అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే అక్కడి అభిమానుల్ని అలరించేందుకు దేవరను జపాన్‌లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియా, అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించారు.
 
Ntr- Japan fans
ఈ క్రమంలో ఓ అభిమాని ఎన్టీఆర్ వద్దకు వచ్చి తెలుగులో మాట్లాడారు. జపాన్‌లో ఇలా తెలుగు మాట్లాడటం ఏంటి? అని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. దీంతో ఆ ఎమోషనల్ వీడియోని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఒక జపనీస్ అభిమాని తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారట. ఆ అభిమాని గురించి చెబుతూ ఎన్టీఆర్ ఓ పోస్ట్ వేశారు. సినిమా అనేది భాషా సరిహద్దుల్ని చెరిపేస్తుందని, అందరినీ ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
 
‘నేను జపాన్‌కి వచ్చినప్పుడల్లా అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త భిన్నమైన అనుభూతి కలిగింది. ఒక జపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం విని నిజంగా నన్ను కదిలించింది. సంస్కృతుల మధ్య వారధిగా ఉండటానికి సినిమా అనేది ఓ శక్తిలా ఉంటుందని చాటి చెప్పారు. సినిమా, భాషల ప్రేమికుడిగా ఒక అభిమానిని భాష నేర్చుకోవడానికి ఆ సినిమా ప్రోత్సహించింది అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి వాటి కోసమే మన ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామ’ని ఎన్టీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments