Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ జవాన్లపై నేను చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదు.. వెంటనే శిక్షించండి : ఓం పురి

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తర్వాత ఓం పురి పాకిస్థానీ నటులకు మద్దతుగా తన గొంతును వినిపించిన సంగతి తెలిసిందే. కళలు, రాజకీయాలు వేర్వేరు అంశాలని, పాకిస్థానీ నటులను నిషేధించడం వల్ల దేశంలో పరిస్థితు

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:30 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తర్వాత ఓం పురి పాకిస్థానీ నటులకు మద్దతుగా తన గొంతును వినిపించిన సంగతి తెలిసిందే. కళలు, రాజకీయాలు వేర్వేరు అంశాలని, పాకిస్థానీ నటులను నిషేధించడం వల్ల దేశంలో పరిస్థితులు మారిపోవని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థానీ నటులు చట్టవిరుద్ధంగా భారత్‌లో ఉండడం లేదని ఒక వేళ వారిని దేశం నుంచి వెనక్కి పంపితే భారత నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. 
 
పాకిస్థానీ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ)నిషేధం విధించడంతో ఆయన ఆర్మీ జవాన్లపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. పలువురు బాలీవుడ్ నటులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. జవాన్లను ఎవరైనా ఆర్మీలో చేరమని బలవంతం పెట్టారా? అని ఓం పురి వ్యాఖ్యానించడం పెను దుమారం రేపింది. 
 
ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఓం పురిపై పోలీసు స్టేషన్లలో కేసు కూడా నమోదైంది. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు గాని అమరవీరులైన భారత ఆర్మీ జవాన్లపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఓం పురి క్షమాపణ చెప్పుకున్నారు. ఆర్మీ తనను శిక్షించాలని, ఆర్మీ జోన్కు పంపించి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలని క్షమాపణ ప్రకటనలో తెలిపారు. తనది క్షమించరాని నేరమని, వెంటనే తనని శిక్షించమని ప్రాదేయపడ్డారు. 
 
మొదట తాను ఉడి ఉగ్రఘటనలో అమరవీరుల కుటుంబసభ్యులకు క్షమాపణ చెబుతానని చెప్పారు. ఒకవేళ వారు క్షమిస్తే, దేశాన్ని, ఆర్మీని క్షమాపణ కోరతానన్నారు. తనని యుద్ద ప్రాంతంలోకి పంపాలని, దేశ రక్షణలో ఆర్మీజవాన్లకు సహకరిస్తానని చెప్పారు. ఆయుధాలను ఎలా వాడాలో ఆర్మీ తనకు నేర్పించాలని, ఎక్కడైతే ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను దేశానికి త్యాగం చేశారో ఆ ప్రాంతంలోకి తనను పంపించాలని ప్రాదేయపడ్డారు. క్షమించాలని మాత్రమే తాను కోరుకోవడం లేదని, తనను కచ్చితంగా శిక్షించాలని కోరుతున్నట్టు ఓం పురి తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments