Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ లవ్ యూ పండూ: పూరీ జగన్నాథ్, ఎవరు?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (15:38 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌తో తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. దీంతో పూరి ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం పూరి సెన్సేష‌న‌ల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 
 
ఇదిలా ఉంటే... పూరి జగన్నాధ్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు.
 
ఇంత‌కీ ఏం చేసాడంటే... పూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు కానీ తన సతీమణి లావణ్య గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. భార్య లావ‌ణ్య‌తో కలిసి ఉన్న ఫోటోలు కూడా షేర్ చేసుకోరు.
 
అయితే... ఏమైందో ఏమో కానీ... గత కొన్ని రోజులుగా తన సతీమణితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆమెతో కలిసి ఉన్న ఓ బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసి 23వ యానివర్సరీ. పండూ ఐ లవ్ యూ.. ఆల్వేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. 
 
ఈ ఫోటోలో పూరి... తన సతీమణిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక లవ్లీ పోజిచ్చారు. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోతో పూరి తన భార్య‌ లావణ్య అంటే ఎంత ఇష్ట‌మో చెప్ప‌క‌నే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments