Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన్ని చూసి కాపీకొట్టా. కుదిరితే ప్రభాస్ తో తప్పకుండా సినిమా చేస్తా : హీరో గోపీచంద్

డీవీ
బుధవారం, 9 అక్టోబరు 2024 (16:28 IST)
Gopichand
లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ విశ్వంలో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి అని హీరో గోపీచంద్  అన్నారు.
 
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో  విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు. 
 
ఈ కథ నేరేట్ చేసినప్పుడు మీ ఇనిషియల్ ఫీలింగ్ ఏమిటి?
- శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత 'విశ్వం' కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి.  
 
విశ్వం షూటింగ్ లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ? 
- శ్రీనువైట్ల గారితో వర్క్ చేయడం ఎక్సైటింగ్  అనిపించింది. 24 అవర్స్ ఆయన సినిమా తప్పితే వేరేది ఆలోచించరు. ఆయనకి సహజంగా కోపం రాదు. ఒక ఆర్టిస్ట్ కి కంఫర్ట్ జోన్ ఇచ్చి కావాల్సిన పర్ఫార్మెన్స్ ని రాబట్టుకోవడంలో ఆయన మాస్టర్. 
 
ఇందులో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా వుంటుందని చెప్పారు. ఎలావుండబోతోంది? 
-శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన నుంచి మరో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందంటే కంపారిజన్ ఉంటుంది. అయితే అది వేరే జోనర్,  ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. 
 
-వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు.  ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది. 
 
ఇందులో పాప చుట్టూ  కథ ఉంటుందా? 
-బేసిక్ గా ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. పాపకి ఏడేళ్లు ఉంటాయి. కానీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆ పెర్ఫామెన్స్ చూసి షాక్ అయ్యాను. ఆ పాప కూడా ఈ సినిమాకి చాలా ప్లస్. అలాగే ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. శ్రీనువైట్ల గారు ఎమోషన్ ని చాలా అద్భుతంగా తీశారు. 
 
యాక్షన్ కామెడీ రెండు డిఫరెంట్ జోనర్స్ కదా.. ఆ రెండిని ఎలా బ్లెండ్ చేశారు? 
-శ్రీను వైట్ల గారి సినిమాల్లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన ఈ రెండిటిని పర్ఫెక్ట్ బ్లడ్ తో తీసుకొస్తారు. మనం చెప్పాలనుకున్న కథని ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేసుకుంటారని ఆయన నమ్మకం. అలానే ఆయన సక్సెస్ అయ్యారు. విశ్వం కూడా అంత బాగుంటుందని మా నమ్మకం. 
 
-శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంటుంది. ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, ఆయన ప్రతి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడానికి ఫస్ట్ టుడేస్ నాకు కొంచెం కష్టం అనిపించింది.  ఆయనది చాలా యూనిక్ టైమింగ్. మూడో రోజు నుంచి కొంచెం ఎక్కువ సార్లు చేసి చూపించరా అని అడిగాను. ఆయన చేసినట్లు కాపీ కొట్టేసాను. డబ్బింగ్ కూడా ఆయనకి ఎలా కావాలో ఆయన్ని చూసి కాపీకొట్టి చెప్పేసాను. 
 
విశ్వం టైటిల్ గురించి? 
-ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లగారికి  చెప్పాను. అయితే ఈ సినిమాకి 'విశ్వం' టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.
 
ఈ సినిమాలో మెమరబుల్ మూమెంట్స్,  మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి?
- కొంత ఎపిసోడ్ మనాలి లో మైనస్ 15 వద్ద షూట్ చేశాం. ఆ  కండీషన్ లో షూటింగ్ చేయడం చాలా టఫ్. చేతులు వంకర్లు పోయావే. అలాగే ఒక మెలోడియస్ సాంగ్ ఉంది. అది ఇటలీలోని షర్టీనియాలో చేశాం. ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఆ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది . కానీ అక్కడికి వెళ్లి షూట్ చేయడం అనేది చాలా చాలెంజింగ్. ఒక హిల్ ఏరియా లాంటిది. కొంచెం కాలు జారిన ఎక్కడో లోయలో ఉంటాం. 
 
-ఇటలీలో మతేరా అనే చోట షూట్ చేశాం. అలాగే షర్టీనియాలో షూట్ చేశాం. ఇప్పటివరకు ఎవరు అక్కడ షూట్ చేయలేదు. చాలా మంచి మంచి లొకేషన్స్ ఇందులో ఉంటాయి.  
 
ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదని చెప్పారు? 
-సినిమా చాలా బావుంది. చూసినంతసేపు నవ్వుతూనే వుంటారు. థియేటర్ లో రెండున్న గంటల పాటు ఆడియన్స్ హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేసే సినిమా ఇది. విశ్వం పర్ఫెక్ట్ పండగ సినిమా. వెరీ క్లీన్ గా వుంటుంది. ఫ్యామిలీ అంతా కలసి హాయిగా నవ్వుకోవచ్చు. 
 
కథ విన్నప్పుడు ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు? 
-స్టోరీ విన్నప్పుడు బోర్ కొట్టకూడదు. ఎంగేజింగ్ గా ఉండాలి. కథని నేను ఒక ఆడియన్ లాగే వింటాను. బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ అనిపించినప్పుడు అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ఇష్టపడతాను. 
 
ప్రభాస్, మీ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు? 
మాకు చేయాలనే వుంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments