Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత సంపాదించి ఏం లాభం అందుకే ఆకుకూర‌లు పండిస్తున్నాః స‌మంత‌

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:57 IST)
Samantha terrace gardening
ఎంత సంపాదించినా ఏం లాభం. అవ‌స‌రానికి తిన‌డానికి క‌నీసం కాయ‌గూర‌లు, ఆకుకూర‌లు లేకుండా బ‌జారు వెంట ప‌డుతున్న ప్ర‌జ‌ల్ని చూసి చ‌లించిపోయానంటోంది స‌మంత అక్కినేని.

కోవిడ్‌-19 స‌మ‌యంలో లాక్‌డౌన్ పెట్టిన‌ప్పుడు దేశ‌మంతా సామాన్య‌ల పాట్లు చూస్తుంటే నేను చైత‌న్య చ‌లించిపోయాం. గతేడాది కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ ఉంటుందని తెలిసి అందరూ సరుకులు, కూరగాయల కోసం దుకాణాల ముందు బారులు తీరారు. ఆకుకూరలు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి.

అలాంటి సమయంలో ‘ఇంత సంపాదించి ఏం లాభం. సరిగ్గా భోజనం కూడా తినలేనప్పుడు’ అని చై, నేను అనుకున్నాం. అలా, నేను టెర్రస్‌ గార్డెనింగ్‌ ప్రారంభించాను. ఆ తర్వాత నుంచి వెజిటేరియన్‌గా మారాను. షూటింగ్‌ లేకుండా ఇంటి దగ్గరే ఉంటే అన్ని విషయాలు నేనే చూసుకుంటాను.’’ అని సమంత తెలిపారు.
 
సమంత ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మేన్‌-2’తో ఓటీటీలో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్ర‌మోష‌న్‌లో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్‌ ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. త‌మిళుల ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తింటుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఈ సినిమా ఆపివేయ‌మ‌ని కేంద్రాన్ని కోరింది. మ‌రి ఏమి జ‌రుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments