Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కంటే అవసరాన్నే నమ్ముతా.. దానికి పెళ్లి అవసరమా. . సల్మాన్ ప్రశ్న

ట్యూబ్‌లైట్‌’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్‌.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన వ్యాఖ్యలు చాలామందిని నవ్వించాయి. ‘‘నా వరకూ పెళ్లి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పెళ్లంటే డబ్బు వృథా చేసుకోవడమే. పెళ్లి మీద నాకు నమ్మకం లేదు. నేను కేవలం అవసరాన్నే నమ్ముత

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (02:25 IST)
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు ప్రేమ వ్యవహారాలు కొత్త కాదు. ప్రస్తుతం లులియ్‌ వంతుర్‌తో ఆయన చెట్టాపట్టాలేసుకొని తిరిగినా.. కత్రినా కైఫ్‌తో సన్నిహితంగా మెలిగినా ఆయన ప్రేమ వ్యవహారాలపై ఎన్నో రుమర్లు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. బాలీవుడ్‌లో ముదురు బ్రహ్మచారిగా పేరొందిన సల్మాన్‌ ఖాన్‌ తాజాగా ‘మిడ్‌ డే’ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. తనవరకు పెళ్లి చేసుకోవడం అంటే డబ్బు వృథా చేసుకోవడమేనని పేర్కొన్నారు.
 
బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హీరో ఎవరు అంటే ఇదీ ఒక ప్రశ్నేనా అని ఎవరైనా అంటారు. యస్‌.. బ్యాచిలర్స్‌లో సీనియర్‌ బ్యాచిలర్‌ అయిన సల్మాన్‌ ఖాన్‌ పేరు ఎవరైనా చెప్పేస్తారు. 51 ఏళ్లు నిండినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారీ కండలవీరుడు. సల్మాన్‌ ఏ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నా విలేకరులు అడిగే కామన్‌ ప్రశ్న ఒక్కటే. ‘మీ పెళ్లెప్పుడు’ అని. దానికి తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యలు చేస్తూ పెళ్లి మాట దాటవేస్తుంటారు సల్లూ భాయ్‌.
 
తాజాగా మరోసారి సల్మాన్‌ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న సల్మాన్‌.. ‘పెళ్లితో డబ్బు వృథా’ అంటూ చేసిన వ్యాఖ్యలు చాలామందిని నవ్వించాయి. ‘‘నా వరకూ పెళ్లి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పెళ్లంటే డబ్బు వృథా చేసుకోవడమే. పెళ్లి మీద నాకు నమ్మకం లేదు. నేను కేవలం అవసరాన్నే నమ్ముతా. మన జీవితానికి ఎవరు అవసరమవుతారన్నదే ఆలోచిస్తా’’ అన్నారు. 
 
‘నేను ప్రేమను ఎంతమాత్రం విశ్వసించను. ప్రేమ అనేది ఒకటి ఉందని చెప్పడానికి కారణాలు నాకేమీ కనిపించలేదు. ఉన్నదల్లా అవసరమే. ఎవరి అవసరం ఎక్కువ లేదా ఒకానొక సమయంలో ఎవరు నీకు ఎక్కువ అవసరం అన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. కానీ, ఆమెకు నీ అవసరం అసలే ఉండకపోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఆమె అవసరం నీకు ఉండకపోవచ్చు. కాబట్టి అన్ని సమయాల్లోనూ ఈ అవసరం సమంగా ఉండాల్సి ఉంటుంది. అలా జరిగితే జరగొచ్చు. జరగకపోవచ్చు’ అని సల్మాన్‌ చెప్పుకొచ్చారు. ప్రేమ అంటే మౌలికంగా అవసరమేనని అన్నారు.
 
పెళ్లయితే వేస్ట్‌ అంటున్నారు కానీ, సల్మాన్‌ ఎఫైర్లు మాత్రం వేస్ట్‌ అనడంలేదు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, సంగీతా బిజ్లానీ, తాజాగా లులియా వంతూర్‌.. ఇలా ఈయనగారి గర్ల్‌ఫ్రెండ్స్‌ లిస్ట్‌ చాలానే ఉంది. ఈ లిస్ట్‌ ఇంతటితో ఆగుతుందా
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments