Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని లేపుకొస్తే భరత్‌కు పెళ్లి చేశా... నేను ఆశ్రయం కోల్పోయా: పోసాని

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (20:36 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భరత్ ఓ అమ్మాయిని లేపుకొస్తే తానే దగ్గరుండి తానే దగ్గరుండి వివాహం జరిపించా.. ఆ తర్వాత ప్రముఖ రచయిత పరుచూరి బ్రదర్స్ వద్ద తాను ఆశ్రయం కోల్పోయినట్టు చెప్పారు. ఇపుడు భరత్ మృతి చెందిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.
 
సినీ కెరీర్‌ ఆరంభంలో పరుచూరి బ్రదర్స్‌ వద్ద అసిస్టెంట్‌గా పోసాని పనిచేశారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్‌ ఆఫీస్‌లోనే ఓ రూమ్‌లో ఉండేవారు. ఆసమయంలో హైదరాబాద్‌ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన భరత్‌.. పోసాని రూమ్‌కు ఆశ్రయం కోసం రాగా, ఆయన సమ్మతించి ఆశ్రయం కల్పించాడు. అయితే ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్.. తమ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న పోసానిని ఇంటి నుంచి బయటకు పంపేశారు.
 
ఈ సందర్భంగా భరత్‌ పెళ్లి గురించి మాట్లాడుతూ.. భరత్‌ హైదరాబాద్‌లో ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడని, అతడి పెళ్లి తామే చేశామని చెప్పారు పోసాని. అయితే వారు ప్రస్తుతం విడిపోయారని ఆ ఇంటర్వ్యూలో పోసాని చెప్పుకొచ్చారు. కాగా, భరత్ రాజును కడసారి చూసేందుకు సైతం హీరో రవితేజ, ఆయన తల్లి రాజ్యలక్ష్మి రాలేదు. ఇది కూడా ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments