Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండుగా చీరలో కనిపిస్తా... కాస్త మసాలా చేర్చుతాం.. సీక్రెట్ లవర్ లేదు: రష్మీ గౌతమ్

బుల్లితెరపై యాంకర్‌గా వెలుగొందుతూ అడపాదడపా వెండితెరపై నటిస్తున్న రష్మీ గౌతమ్.. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా నెక్ట్స్‌ నువ్వే చిత్రంలో ఓ నాయికగా నటించింది.

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (16:45 IST)
బుల్లితెరపై యాంకర్‌గా వెలుగొందుతూ అడపాదడపా వెండితెరపై నటిస్తున్న రష్మీ గౌతమ్.. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా నెక్ట్స్‌ నువ్వే చిత్రంలో ఓ నాయికగా నటించింది. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ప్రభాకర్‌ దర్శకత్వంలో వి4 పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రష్మీ మాట్లాడుతూ.. ఇందులో చాలా గ్లామరస్‌గా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత చీరకట్టుకుని నటించే పాత్ర లభించిందని.. ఎక్కువ సేపు చీరలోనే వుంటానని తెలిపింది. 
 
హాట్‌ డైలాగ్స్‌, సినిమాలో సందర్భానుసారమైన కామెడీలో కనిపిస్తానని రష్మీ చెప్పుకొచ్చింది. శృంగారం ఎక్కువున్న పాత్రలే వస్తున్నాయి కాబట్టి నటిస్తున్నానని రష్మీ తెలిపింది. తానైతే అలాంటి రోల్స్ కోరుకోవట్లేదని తెలిపింది. జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌పై రష్మీ స్పందిస్తూ .. పెద్దవాళ్లు ఆ షో చూసినప్పుడు వారికి తెలుసు షో నుంచి ఏది తీసుకోవాలో.. ఏది తీసుకోవద్దోనని తెలిపింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయనే ఆ షోను 9.30 గంటలకు ప్రసారం చేస్తున్నారని బదులిచ్చింది.
 
సుడిగాలి సుధీర్‌తో అఫైర్ లేదని రష్మీ క్లారిటీ ఇచ్చింది.. కొన్ని వెబ్‌సైట్లు క్లిక్స్ బిజినెస్‌ కోసం ఏదో రాస్తుంటారని.. తనకు వ్యక్తిగత జీవితముందని.. జబర్దస్త్, ఢీ షో క్రేజ్ పెంచడానికి మేము కొంత మసాలా చేర్చుతాం. దాన్ని చూసి ఏదో అనుకొంటారు. ఏదేదో ఊహించుకొంటారని.. అది మా తప్పు కాదని రష్మీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments