Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మతో నాకు ఎలాంటి గొడవల్లేవు: నట్టికుమార్

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (18:50 IST)
వర్మకు, నాకూ మధ్య విభేదాలు తలెత్తాయని కొందరు అపోహ చెందుతున్నారు. అయితే అవి వాస్తవాలు కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని సినిమాలను కలసి చేసాం, మరికొన్ని సినిమాలను కలసి చేయబోతున్నాం కూడా అని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పష్టం చేశారు.
 
నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టి క్రాంతి సమర్పణలో నిర్మాతలు నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల సంయుక్తంగా 'సైకో వర్మ'(వీడు తేడా) పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి నట్టి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు తాజాగా విడుదల చేసిన ''పిచ్చోడి చేతిలో రాయి'', సైకో వర్మ''నే మన భాయి'' అంటూ సాగే లిరికల్ సాంగ్ విశేషమైన స్పందనతో ట్రెండింగ్‌లో వుంది.
 
ఈ నేపథ్యంలో టైటిల్‌తో పాటు లిరికల్ సాంగ్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు అధిక శాతం తమ మధ్య గొడవలు వచ్చాయని అపోహ చెందుతున్నారు. కానీ మా మధ్య పటిష్టమైన స్నేహబంధం వుంది. వర్మకు సినిమానే శ్వాస, ధ్యాస. సంచలనాలకు మారు పేరైన వర్మ కరోనా టైమ్‌లో కూడా అత్యధిక సినిమాలు చేశారు..చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఏడు సినిమాలతో క్షణం తీరికలేనంతగా ఆయన బిజీగా వున్నారు.
 
సైకో అంటే పిచ్చి, వర్మ సినిమా పిచ్చోడు కాబట్టి ఆ అర్ధాన్ని అన్వయించేలా ఈ టైటిల్ పెట్టాం. అలాగే ఓ క్రియేటివిటీ దర్శకుడిగా ఆయన సినిమా ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ... ఆయన మనస్తత్వాన్ని ఆ పాటలో ప్రతిబింబింప చేసాం తప్ప వర్మ పట్ల వ్యతిరేకతతో మాత్రం కాదు అని నట్టి కుమార్ వివరించారు.
 
ఇక సెప్టెంబర్ 9న ఈ చిత్రం షూటింగును ప్రారంభించి... నిరవధికంగా చేస్తామని, ఇప్పుడొస్తున్న చిత్రాలకు మాత్రం భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని గట్టిగా చెప్పగలం. అయితే కథ అంశాన్ని ఇప్పుడే చెప్పదలచుకోలేదు. ఆర్టిస్టులతో పాటు మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని నట్టికుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments