Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం కోసం క‌ష్ట‌ప‌డితే బెడిసికొట్టింది .. తాప్సీ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (12:33 IST)
Tapsi pannu
మ‌హిళ‌లు అందంగా వుండ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. త‌మ‌కు తోచిన విధంగానో, ఎవ‌రో చెప్పిన మాట‌ల‌నుబ‌ట్టో జిమ్‌లో ట్రైనీ చెప్పిన దానిని బ‌ట్టి కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తుంటారు. అలాంటిదే న‌టి తాప్సీ కూడా చేసింది. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో అందంగా కంప‌ల్‌స‌రీ. అయితే తాను పెద్ద‌గా అందంగా వుండ‌న‌ని తాప్సీకి అనిపిస్తుంద‌ట‌.
 
త‌ప్ప‌డ్‌, హ‌సీనా దిల్ రుబా వంటి భిన్న‌మైన చిత్రాల్లో అంతే భిన్న‌మైన పాత్ర‌లు పోషించిన తాప్సీ ప‌న్ను తాజాగా ఓ విష‌యాన్ని బ‌య‌ట పెట్టింది. నా క‌ళ్ళు చూడ‌చ‌క్క‌గా వుండ‌వు. చాలామంది హీరోయిన్ల‌కు మ‌ల్లే నా బాడీ వుండ‌దు. జుట్టు కూడా రింగులు రింగులులా క‌నిపిస్తాయి. అందుకోసం ఓసారి సెలూన్‌కు వెళ్ళాను. కెమిక‌ల్స్ అప్ల‌యి చేస్తే బాగా అందంగా జుట్టుతోపాటు మీరు క‌నిపిస్తార‌ని చెప్పారు. దాంతో ప్ర‌యోగం చేశాను. వెంట‌నే జుట్టు రాల‌డం మొద‌లైంది. దాంతో నాకు జ్ఞానోదం అయింద‌ని చెప్పుకొచ్చింది.
 
- నిజానికి అందానికి పరిమితి లేదు. దానికి నేను స‌రిపోను అనుకోవ‌డం త‌ప్పు. జీవితాన్ని ప్రేమ‌తో జీవించాలి. మ‌న‌ల్ని మ‌నం ఇష్ట‌ప‌డితే బాహ్య సౌంద‌ర్యం  అందంగా క‌నిపిస్తుంది అని అనుభ‌వ పూర్వంగా చెబుతోంది. 
 
- తాజాగా తాప్సీ మిథాలీరాజ్ బ‌యోపిక్‌లో న‌టిస్తోంది. అందుకోసం చాల క‌స‌ర‌త్తులు చేస్తుంది. ర‌న్నింగ్ క్రికెట్ వంటివి శిక్ష‌కుల సంర‌క్ష‌ణ‌లో నేర్చుకుంది కూడా. ఈ సంద‌ర్భంగా ఫిట్‌నెస్‌, అందం గురించి ఢిల్లీలో జ‌రిగిన ఏ ఇంట‌ర్వ్యూలో ఆమె ఈమాట‌లు చెప్ప‌కొచ్చింది.

- కాబ‌ట్టి. అమ్మాయిలుకానీ అబ్బాయిలు కానీ ఇక‌పై మీరు కూడా జుట్టు బాగోలేద‌నో, అందంగా లేన‌నో ఇలాంటి ప్ర‌యోగాలు చేయ‌కండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments