Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు పోవడంతో ఒంటరితనం.. ఇపుడు నేనూ - నా బిడ్డ మాత్రమే ఉన్నాం : గౌతమి

Gautami
Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (12:25 IST)
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసమయంలో హీరోయిన్‌గా రాణించిన అతికొద్ది మంది హీరోయిన్లలో గౌతమి ఒకరు. అయితే, ఈమె వ్యక్తిగత జీవితంలో సినిమా కష్టాలను చవిచూశారు. వైవాహిక జీవితం మొదలుకుని వ్యక్తిగత జీవితం వరకు అనేక కష్టాలు అనుభవించారు. ఇపుడు తన ఏకైక కుమార్తె కోసం ఆమె జీవిస్తున్నారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు పోవడంతో ఒంటరితనాన్ని అనుభవించినట్టు చెప్పారు. ముఖ్యంగా, వైవాహిక జీవితంలో అనేక ఒడి దుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. పైగా, అది ఒక పరీక్షా కాలంగా ఆమె అభివర్ణించారు. 
 
"మా తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. అగ్గిపుల్ల కూడా గీయడం నాకు చేతకాదు. అలా పెంచారు. నా 16వ యేటనే హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. నాకు పాప పుట్టిన తర్వాత నేను సింగిల్ పేరెంట్‌గా ఉన్నాను. చేతుల్లో పసిబిడ్డను పట్టుకుని మా తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాను. ఆ తర్వా అమ్మ చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్న నా గురించే ఆలోచించేవారు. ఒక యేడాది తర్వాత ఆయన కూడా పోయారు. 
 
ప్రస్తుతం నేను, నా బిడ్డ మాత్రమే మిగిలిపోయాం. ఇంటిపట్టునే ఉండిపోవడంతో మనుషులను సరిగ్గా అంచనా వేయలేకపోయాను. ఎవరు ఎలాంటివారు అనేది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గౌతమి చెప్పుకొచ్చారు. కాగా, ఈమె హీరో కమల్ హాసన్‌తో కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత వేరుపడిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments