Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవు : అను ఇమ్మాన్యుయేల్

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (16:26 IST)
Anu Emmanuel
హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు
 
- జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తి చూపిస్తాను.  
 
-  కార్తి అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆఫ్ స్క్రీన్ కార్తి గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇది కార్తి గారికి 25వ చిత్రం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్.
 
- జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా వుంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు.
 
-  'జపాన్' లో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా వుంటుంది. దాని  గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా వుంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ వుంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.
 
- నాకు డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని వుంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pastor Praveen Kumar’s Death: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments