Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత టైం పడుతుందని తెలిసి ఉంటే చస్తే తీసేవాడిని కాదు: రాజమౌళి

దగ్గర డబ్బులు అయిపోయాయని, ఒక్కసారి దిగిన తర్వాత ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తిరిగి చూడలేం కాబట్టే మొండిగా సినిమాను చేస్తూపోయామని, దానికి ఫలితం దక్కిందనే అనుకుంటున్నామని బాహుబలి దర్శకుడు రాజమౌళి చెప్పారు. ‘బాహుబలి’ రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పడు

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (05:44 IST)
బాహుబలి సినిమాను రెండు భాగాలు చేయాలని కల్లో కూడా అనుకోలేదని, షూటింగ్‌ మొత్తం పూర్తి కాకముందే మా దగ్గర డబ్బులు అయిపోయాయని, ఒక్కసారి దిగిన తర్వాత ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తిరిగి చూడలేం కాబట్టే మొండిగా సినిమాను చేస్తూపోయామని, దానికి ఫలితం దక్కిందనే అనుకుంటున్నామని బాహుబలి దర్శకుడు రాజమౌళి చెప్పారు.  ‘బాహుబలి’ రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పడుతుందని ముందే ఊహించి ఉంటే సినిమా చేసేవాణ్ణి కాదని స్పష్టం చేశారు. నిర్మాతలు నాపై నమ్మకంతో జీవితాలను ఫణంగా పెట్టి ఖర్చుకు సిద్ధపడ్డారు కాబట్టే బాహుబలి సాధ్యపడిందని రాజమౌళి అన్నారు. నేను నా కలను సాకారం చేసుకునే క్రమంలో నా కుటుంబ సభ్యులంతా నన్ను కాపాడుకున్నారు. ప్రభాస్ అయితే అయిదేళ్లపాటు అలసట లేకుండా పనిచేసుకుపోయే ఎనర్జీని తన మాటల్తో అందించాడని రాజమౌళి పొగిడేశారు. బాహుబలి నిర్మాణంపై రాజమౌళి అభిప్రాయాలు తన మాటల్లోనే...
 
 ‘బాహుబలి’ రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పడుతుందని ముందే ఊహించి ఉంటే సినిమా చేసేవాణ్ణి కాదు. ఒక్కసారి దిగిన తర్వాత ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తిరిగి చూడటానికి ఏముంటుంది ఓ సినిమాకు పని చేస్తున్నంత సేపూ ఓ ఉత్సాహం ఉంటుంది. పని పూర్తయిన తర్వాత టెన్షన్‌ స్టార్ట్‌ అవుతుంది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతోంది. అందుకే, నాకిప్పుడు టెన్షన్‌గా ఉంది.
 
మా నిర్మాతలు నాపై నమ్మకంతో జీవితాలను పణంగా పెట్టి ఖర్చుపెట్టారు. మా ఫ్యామిలీ మెంబర్స్‌ ఏయే పనులు చేశారో అందరికీ తెలుసు. నేను నా కలను సాకారం చేసుకునే క్రమంలో వాళ్లంతా నన్ను కాపాడుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌ అయితే... ‘నీ లెవల్‌ ఇది కాదు. నువ్వింకా చేయగలవ్‌’ అని ఎంతో ఎనర్జీ ఇచ్చాడు.
 
ఓ సినిమాను అసంపూర్తిగా ముగించడం మనకు కొత్త. కానీ, హాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఈ పద్ధతి ఉంది. అందువల్ల, ‘బాహుబలి’ని రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్నప్పుడు నాకెలాంటి డౌట్స్‌ రాలేదు. నిజం చెప్పాలంటే రెండు భాగాలుగా తీయాలనుకో లేదు. షూటింగ్‌ మొత్తం పూర్తి కాకముందే మా దగ్గర డబ్బులు అయిపోయాయి. అప్పుడు మొదటి భాగం విడుదల చేసిన ఓ నాలుగైదు నెలలకు ‘బాహుబలి–2’ విడుదల చేయాలనుకున్నాం. ఇన్నాళ్లు పట్టింది.
 
బయట దేశాలవారికి తెలుగు, తమిళ, దక్షిణాది సినిమాల గురించి అస్సలు తెలీదు. భారతీయ సినిమా గురించి పెద్దగా తెలీదు. ఒకవేళ హిందీ సినిమాల గురించి తెలిసినా... షారుక్‌ఖాన్‌ అంటుంటారు. అటువంటి స్థాయి నుంచి భారతీయ సినిమా అంటే ‘బాహుబలి’ అనే స్థాయికి తీసుకురాగలిగాం. ఇది నాకెంతో గర్వంగా అనిపించింది. సినిమా అంత పెద్ద హిట్టయితే ఎవరికైనా గర్వం ఉంటుంది. 
 
ఏ దర్శకుడూ తను ఊహించినట్టు, ఊహలకు అనుగుణంగా సినిమా తీయలేడు. మనసులో ఉన్నదాన్ని వంద శాతం తెరపై ఆవిష్కరించడం అసాధ్యం. కానీ, ఓ కథకుడిగా ‘బాహుబలి’ నాకెంతో సంతృప్తి ఇచ్చింది. ఇంతకుముందు నా సినిమా కథల్లో హీరో పాత్ర మాత్రమే బలంగా ఉండేది.కానీ ఈ సినిమాలో ఒక్కటి కాదు... ఏడు పాత్రలు ఎంతో శక్తిమంతంగా ఉంటాయి. నాకు నచ్చిన హీరోయిజాన్ని తెరపై చూపించా. నా ఊహలను మాగ్జిమమ్‌ ఆవిష్కరించిన సినిమా ‘బాహుబలి.
 

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments