Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో మరో బయోపిక్.. ఉబ్బితబ్బిబ్బవుతున్న శ్రద్ధాకపూర్

ఒక తరం అమ్మాయిలను తమవైపుకు తిప్పుకున్న గొప్ప క్రీడాకారిణులలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ యావద్భారత్‌పై తమ ముద్ర వేశారు. బాలీవుడ్‌కు బయోపిక్‌లకు అవినాభావ సంబంధం ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే మిల్కా సింగ్, మేరీ కోమ్, ఎమ్ఎస్ ధోనీ, పోగట్, సచిన్

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (04:13 IST)
ఒక తరం అమ్మాయిలను తమవైపుకు తిప్పుకున్న గొప్ప క్రీడాకారిణులలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ యావద్భారత్‌పై తమ ముద్ర వేశారు. బాలీవుడ్‌కు బయోపిక్‌లకు అవినాభావ సంబంధం ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే మిల్కా సింగ్, మేరీ కోమ్, ఎమ్ఎస్ ధోనీ, పోగట్, సచిన్ టెండూల్కర్ వంటి అతి గొప్ప క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించిన బాలీవుడ్ తాజాగా సైనా నెహ్వాల్ బయోపిక్‌తో ముందుకొస్తోంది. సైనా పాత్ర పోషించే అవకాశం ప్రముఖ నటి శ్రద్ధాకపూర్ రావడంతో ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
 
 
 
క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది. ప్రపంచ అగ్రశ్రేణి షట్లర్‌ సైనా జీవిత చరిత్రలో శ్రద్ధాకపూర్‌ టైటిల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా శ్రద్ధాకపూర్‌ వెల్లడించారు. ‘సైనా’ సినిమాలో టైటిల్‌ రోల్‌ రావడం తన అదృష్టమని తెలిపారు.
 
అగ్రశ్రేణి క్రీడాకారిణిగా సైనా జీవితం ఆద్యంతం ఆసక్తికరం. సైనా ప్రపంచ మాజీ నెం.1 బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. కోట్లాదిమందికి ఆమె ఆదర్శనీయం. యువతకు మార్గదర్శి. అలాంటి సైనా పాత్ర తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని  శ్రద్ధా కపూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రానికి అమోల్‌ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. టీ– సీరీస్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.
 

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments