Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ వుండదు, నేను చాలా ఇండిపెండెంట్ : రెజీనా కసాండ్రా

డీవీ
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:13 IST)
Regina Cassandra
నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసినప్పుడే  వెర్సటైల్ యాక్టర్ గా వుండాలని భావించాను. అది నా నుంచి ఎప్పుడూ దూరం కాకుండా ఇన్నాళ్ళు పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్ అని హీరోయిన్ రెజీనా కసాండ్రా అన్నారు. 
 
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా 'ఉత్సవం'. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ రెజీనా కసాండ్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
-డైరెక్టర్ అర్జున్ సాయి ఈ కథ నెరేటివ్ చేసినప్పుడు వెరీ బ్యూటీఫుల్ గా అనిపించింది. ఈ కథలో సోల్ వుంది. నాటక రంగం గురించి ఆయన చాలా రిసెర్చ్ ఈ కథని రాసుకున్నారు. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న రూటెడ్ స్టొరీ ఇది. అది నాకు చాలా నచ్చింది.
 
-ఇందులో నేను కార్పోరేట్ ఎంప్లాయ్ గా కనిపిస్తాను. తనకి లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ వుండదు. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ విమెన్ రిలేట్ చేసుకునేలా వుంటుంది. కథలో చాలా కీలకంగా వుంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది.  
 
-నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లేస్ ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్ లో ప్లేస్ చేశాను.
 
-ఈ సినిమాలో రంగస్థలం నటులు గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు వున్నాయి. అవన్నీ ఆడియన్స్ ని హత్తుకునేలా వుంటాయి.
 
-ఈ సినిమాలో పని చేసిన అందరూ చాలా సిన్సియర్ గా పని చేశారు. ప్రకాష్ రాజ్, నాజర్ థియేటర్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను.
 
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చెప్పాలంటే...  గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్ గారి సినిమా చేస్తున్నాను. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ వున్నాయి. అవి మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments