Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమిత - వీరు అఫిషియల్ వెడ్డింగ్ వీడియో

ఆకట్టుకునే అందచందాలతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్ నమిత. ఈమె గత నెల 24వ తేదీన తన ప్రియుడు వీరేంద్రను తిరుమల వెంకన్న సన్నిధిలో పెళ్లి చేసుకుంది.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (12:17 IST)
ఆకట్టుకునే అందచందాలతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్ నమిత. ఈమె గత నెల 24వ తేదీన తన ప్రియుడు వీరేంద్రను తిరుమల వెంకన్న సన్నిధిలో పెళ్లి చేసుకుంది. తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా వీరేంద్రని వివాహం జరగగా, పెళ్ళి వేడుకకు శరత్ కుమార్, రాధిక దంపతులతో పాటు పలువురు కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. 
 
పెళ్ళిలో నమిత పింక్ శారీని ధరించగా, వీరేంద్ర పింక్ శెర్వానీలో కనిపించాడు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నమిత చివరిగా తెలుగులో హీరో బాలకృష్ణ నటించి 2010లో విడుదలైన 'సింహ'లో కనిపించింది.
 
'సొంతం' చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన నమిత, ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన 'జెమినీ' చిత్రంలో నటించింది. తెలుగులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో నమిత ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి సారించి అక్కడే సెటిలై పోయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments