Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు, నేను మళ్లీ కలిసి చేస్తాం... హైపర్ ఆది

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (22:37 IST)
జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ అంటే చెప్పనవసరం లేదు. పొట్టచెక్కలు కావాల్సిందే. పంచ్ డైలాగులతో ఆది వేసే పంచ్‌లు అలాంటివి. మొత్తం స్కిట్లలో ప్రతిసారి ఆది స్కిట్స్ చాలా హైలెట్‌గా ఉంటాయి. జడ్జెస్‌గా ఉండే నాగబాబు, రోజాలు ఎప్పుడూ ఆదిని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. అయితే ఉన్నట్లుండి ఆది కూడా జబర్దస్త్‌కు దూరమైన విషయం తెలిసిందే.
 
దానికంతటికీ అసలు కారణంగా నాగబాబు, హైపర్ ఆదిలకు మధ్య ఉన్న బంధమే. నాగబాబుతో తనకున్న బంధాన్ని పంచుకున్నాడు హైపర్ ఆది. నాగబాబును నేను అన్నయ్య అని పిలుస్తాను. మేమిద్దరం జనసేన పార్టీలో కలిసి పనిచేశాం. నాగబాబు ఎంపిగా పోటీ చేసినప్పుడు నేను దగ్గరుండి ప్రచారం చేశా.
 
నాకు జబర్దస్త్‌లో మాత్రమే నాగబాబు పరిచయం కాదు. వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు మంచి స్నేహితుడు. ఒక అన్నగా భావిస్తుంటాను. నన్ను కూడా ఆది అని ప్రేమగా పిలుస్తుంటారు. అంతేకాదు రేయ్ అని ముద్దుగా అంటుంటాడు. ఒక ఫ్యామిలీ మేమంతా. నేను రోజుకొకసారైనా అన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను.
 
నేను ఫోన్ చేసినప్పుడల్లా నాగబాబు బాగా స్పందిస్తారు. అది చాలు నాకు. అయితే మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు అంటున్నాడు హైపర్ ఆది. మళ్ళీ అవకాశం వస్తే ఇద్దరం కలిసి బుల్లితెరపై నటించడానికి సిద్థంగా ఉన్నామని.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో అన్ని షూటింగ్‌లు నిలిచిపోయాయి కాబట్టి త్వరలోనే మళ్ళీ మేమిద్దరం కలిసి బుల్లితెరపై కనిపిస్తామంటున్నారు హైపర్ ఆది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments