Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#ఎన్నికలు వాయిదా, ఉచ్చ పోయిస్తుందంతే, వైసిపికి నాగబాబు కౌంటర్

webdunia
సోమవారం, 16 మార్చి 2020 (21:21 IST)
పంచాయతీ ఎన్నికల వాయిదాపై వైసీపి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనిపై నిన్నటి నుంచి చర్చ నడుస్తూనే వుంది. ఇక వైసీపీపై జనసేన నాయకుడు నాగబాబు ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ఆయన రాతల్లోనే చూడండి. ''ఎన్నికలకన్నా, మన డబ్బు కన్నా, మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా, అన్నిటికన్నా మనిషి ప్రాణాలు ముఖ్యం కదా. ఎన్నికలు ఆపలేదు, postpone చేశారు. ఈ ఎలక్షన్ అకౌంట్‌లో కరోనా ఎఫెక్ట్‌కి ఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా. వైసీపీ వాళ్ళకి వాళ్ళ సపోర్టర్స్‌కి ఎందుకు ఇంత బాధ.
 
ఎలక్షన్స్ postponeకి కులాల ప్రస్తావన ఎందుకు, కులాల మీద పగ ఎందుకు.. ఒక పక్క ఇండియా govt పబ్లిక్ హెల్త్ విషయంలో high alert ప్రకటించింది. అంటే అర్థం విషయం చాలా తీవ్రంగా ఉంటేనే అలా ప్రకటిస్తారు. తెలంగాణ లాంటి పక్క రాష్ట్రాల్లోని కరోనా స్ప్రెడ్ కాకుండా పబ్లిక్ మూవ్మెంట్స్ మీద Restrictions పెట్టారు.
 
ఎలక్షన్స్ అనేవి పబ్లిక్‌తో ముడిపడిన విషయం. పబ్లిక్ gatherings జరుగుతాయి. జనాల ఆరోగ్యంతో ఆడుకోవటం వైసీపీ govtకి కరెక్టా.. మందుల్లేక ఏమిచెయ్యలో అన్ని దేశాలు ఏడుస్తుంటే.. paracetamal వేసుకొంటే సరిపోతుందని చెప్పటం బాధ్యతారాహిత్యం కదా. 
 
కొంతమంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదాని వాళ్ల websitesలో విమర్శిస్తుంటే ఆశ్చర్యపోయాం. మీరు వైసీపీని సమర్ధిస్తే తప్పు లేదు.. కానీ వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఏడవలో అర్థం కాలేదు. life కన్నా ఏది ఎక్కువ కాదు. బాధ పడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి.
 
కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రావు. భరించాలి. ప్రజారోగ్యం ముఖ్యం. focus on it. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండి. 151 మంది mlaలని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం. థాంక్స్ సీఎం గారు.
 
మనకన్నా అన్ని విధాలా  బలహీనుడు, చిన్నవాడు అని ఎవరినీ తక్కువగా చూడొద్దు. వైరస్ కూడా మనకన్నా చిన్నదే, అసలు కంటికే కనబడదు. కొన్నిసార్లు ప్రపంచానికే సుస్సు (ఉచ్చ) పోయిస్తుంది. పెద్దపెద్ద వాళ్ళే వణుకుతున్నారు.. మనమెంత. రెస్పెక్ట్ everyone.. కరోనా అమ్మా మొగుళ్లు వచ్చినా ఆశ్చర్యపోకండి." అంటూ ట్వీట్లు చేశారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

#మహమ్మారి తెలంగాణలో మరొకరికి, స్కాట్లాండ్ వెళ్లొచ్చాడట, దేశంలో - 114