నాకేం సంబంధం లేదు, పబ్ నిర్వహించినందు వల్లే..? నవదీప్

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (19:42 IST)
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో నార్కోటిక్ అధికారులు, పోలీసులు కలిసి సుమారు పది లక్షల రూపాయల విలువుగల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు నైజీరియన్స్, ఒక సినిమా దర్శకుడు, నలుగురు ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రాంచందర్ అనే వ్యక్తి డ్రగ్ సప్లయర్ అని, అతనితో నవదీప్‌కి సంబంధాలు ఉన్నాయని పోలీసుల ఆరోపణ. అందుకనే నవదీప్ ని ఈరోజు సుమారు ఆరు గంటలపాటు నార్కోటిక్ పోలీసులు విచారించారు అని తెలిసింది. 
 
అయితే బయటకి వచ్చిన తరువాత నవదీప్ తనకేమీ డ్రగ్స్‌తో సంబంధం లేదని, తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పాడు. డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం పోలీసుల ఎదుట హాజరైన నటుడు నవదీప్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. గతంలో పబ్ నిర్వహించినందువల్లే నన్ను విచారించారు. గతంలో సిట్, ఈడీ కూడా విచారించింది. ప్రస్తుతం నార్కో పోలీసులు విచారిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారనే విషయాన్ని తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments