Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఆచార్య కోసం భారీ సెట్, 20 ఎకరాల్లో టెంపుల్ టౌన్

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (15:25 IST)
అసలే కోవిడ్ రెండో దశ. కొత్త వైరస్ చొచ్చుకుని వస్తోంది. ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయం కలుగుతోంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగులు కానించేస్తున్నారు. ఎక్కడయినా ప్రత్యేకించి షూటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆ ప్రదేశాన్ని సెట్స్ ద్వారా క్రియేట్ చేసేస్తున్నారు.
 
ప్రస్తుతం ఆచార్య చిత్రం కోసం అదే జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం వేసిన ఒక భారీ టెంపుల్ టౌన్ సెట్ సరికొత్త రికార్డులకు నాంది పలుకుతుంది. దాని స్పెషల్ ఏంటంటే ఆ సెట్‌ని మేకర్స్ నగర శివార్లలో గల కోకాపేటలో 20 ఎకరాల్లో ఎంతో ఖర్చు పెట్టి నిర్మించారు.
 
ఈ నెల పది నుండి మెగాస్టార్ మీద ఈ సెట్లోనే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తరువాత ఈ సినిమాలో తన తండ్రితో పాటు కలసి నటిస్తున్న రామ్ చరణ్ పైన కూడా కొన్ని సిన్లను తెరకెక్కించనున్నారు డైరెక్టర్ కొరటాల శివ. వాటితో చిరు అండ్ చరణ్ పైన ఒక సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరణ జరుపుకోనుంది.
 
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. మాట్ని ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా కరోనా బారిన పడిన రామ్ చరణ్ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. గర్భిణికి తప్పిన ప్రాణాపాయం... (Video)

రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా కుట్రకు కేటీఆర్ ఆదేశం... పట్నం వాంగ్మూలం?

21 యేళ్ళకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి : సీఎం రేవంత్ రెడ్డి

జెత్వానీ కేసు : 16న కుక్కల విద్యాసాగర్‌కు బెయిల్ వచ్చేనా?

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments