Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాలుగో సీజన్.. గంగవ్వ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (13:09 IST)
58 ఏళ్ల వయస్సులో మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయమైంది గంగవ్వ. ఆ ఛానల్ ద్వారా యూట్యూబ్‌ స్టార్‌ అయింది. దీంతో ఇటీవల బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా కూడా అవకాశం వచ్చింది. ఈ విషయం తెలుసుకొని చాలా మంది షాక్ అయ్యారు. ఈ ఏజ్‌లో బిగ్ బాస్ ఆడగలదా?? అసలు ఆమెను ఎలా తీసుకున్నారు అని అనుకున్నారు. కానీ ప్రేక్షకులంతా ఆమెకే సపోర్ట్ చేశారు. 
 
బిగ్ బాస్‌లోకి వచ్చాక కూడా ముందు నుంచీ షోలో గంగవ్వ ప్రేక్షకులకు దగ్గరైంది. తనదైన స్టైల్‌లోనే ఆడుతూ.. మిగితా కంటెస్టెంట్‌లతో చాలా హుషారుగా మాట్లాడుతూ తన ప్రయాణం సాగించింది. కామన్‌గా ఇలాంటి రియాలిటీ షోలలో కంటెస్టెంట్స్‌పై కచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ కొన్నైనా వస్తాయి. కానీ గంగవ్వ మీద ఒక్క నెగెటివ్‌ కామెంట్స్‌ కూడా రాలేదు. 
 
కనీసం ఎలిమినేషన్స్‌లో కూడా డేంజర్ జోన్‌లోకి ఏ ఎపిసోడ్‌లోనూ వెళ్ళలేదు. నామినేషన్ అయినా కూడా ప్రేక్షకులు భారీగా గంగవ్వకి ఓట్లు వేసి సపోర్ట్ చేశారు. ఇలాగే కొనసాగితే గంగవ్వ చివరి వరకు ఉండేది. కానీ తన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో అక్కడ ఉండలేక తన సొంత నిర్ణయం తరువాత 35 రోజుల తరవాత బయటకు వచ్చింది.
 
ఆమె బయటకి రాగానే అన్ని చానెల్స్ ఆమె నివాసానికి పరుగులు తీస్తున్నాయి. ఇక గంగవ్వ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూలలో గంగవ్వ చాలా విషయాలు తెలియచేసింది. ఇక ఆమె రెమ్యునరేషన్‌పై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు. హౌజ్‌లో గడిపిన క్షణాలను గురించి షేర్ చేసుకున్న గంగవ్వ తన పర్సనల్ లైఫ్ విషయాలను గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.
 
35 రోజులపాటు హౌజ్‌లో ఉన్న గంగవ్వకు బిగ్‌బాస్‌ షో ద్వారా అసలు అందిన రెమ్యునరేషన్‌ ఎంత..? అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్‌లా నడుస్తోంది. వీటిపై గంగవ్వ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చింది. 
 
ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ నుంచి తనకు ఒక్క రూపాయి కూడా రాలేదని స్పష్టత ఇచ్చింది. వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారని, ఇంకా ఇవ్వలేదని కానీ కచ్చితంగా ఇస్తానని చెప్పారని చెప్పింది. ఇప్పటివరకు బిగ్ బాస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ అక్కడ నేను ఉండటానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారని తెలిపింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments