Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జన్మకు హృతిక్‌తో కలిసి జీవించలేను : సుసానే ఖాన్

Webdunia
బుధవారం, 4 మే 2016 (13:08 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా రనౌత్, హృతిక్ రోషన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిమధ్య తలెత్తిన వివాదం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, లీగల్ నోటీసులు పంపుకున్న విషయం చివరికి తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు సెటైర్లు వేయడం మరొకరు దానికి స్పందించడం పరిపాటిగా మారిపోయింది.
 
కంగనా పంపించిన మెయిల్స్‌ను హృతిక్ బయటపెట్టడంతో గొడవ మరింత పెద్దదైంది. దాంతో కంగనా కోపం మరింత ఎక్కువైంది. తన మెయిల్‌ను హ్యాక్ చేసిన తర్వాత, తన పేరుతో ఫేక్ ఈమెయిల్ అకౌంట్ ఉందంటూ హృతిక్ ఫిర్యాదు చేయడంపై కంగనా ప్రశ్నించింది. ఈ క్రమంలో ప్రూఫ్‌లు అంటూ తమ దగ్గర ఉన్న కొన్ని ఫోటోలను కూడా బయటకు రిలీజ్ చేశారు. కంగనా అందించిన ప్రూఫ్స్ అన్ని ఫోటో షాప్ బాపతే అని హృతిక్ రోషన్ మాజీ భార్య ఖరాఖండిగా తెల్చేయడంతో… కంగనా ఎపిసోడ్ కీలక మలుపు తీసుకుంది. ఇదిలావుంటే సుసానే తన పిల్లలతో కలిసి అబ్రాడ్ టూర్ వేసింది. 
 
అక్కడికి హృతిక్ కూడా వెళ్లడంతో మళ్ళీ వీరిద్దరు కలవబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై స్పందించిన సుసానే ఓ క్లారిటి ఇచ్చింది 'నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా... హృతిక్‌తో కలిసి జీవితం పంచుకోవడం అనేది జరగదు. కానీ మేం మంచి పేరెంట్స్ - మా తొలి ప్రాధాన్యం పిల్లలే' అంటూ సుసానే ఖాన్ ట్వీట్ చేసింది. దీంతో మాజీ భార్య భర్తలిద్దరు కలవనున్నారనే ప్రచారానికి కూడా అడ్డుతెర పడింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments