Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిత్రుడు విశాల్‌కు ఎనిమి ఎలా అయ్యాడంటే!

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (18:10 IST)
Vishal, Mirnalini Ravi
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి `ఎనిమీ` అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి వచ్చింది? అనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ అద్భుతంగా ఉన్నాయి.
 
ఈ చిత్రంలో గద్దలకొండ గణేష్ ఫేమ్ మిర్నాలిని రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఆర్‌డీ రాజశేఖర్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments