Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హౌ మచ్ క్లీవేజ్ ఈజ్ గుడ్ క్లీవేజ్'... వైరల్ అవుతున్న హీరోయిన్ తాప్సీ వీడియో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నటి తాప్సీ పన్ను ఓ వీడియోను విడుదల చేసింది. మహో మహిళ స్వర భాస్కర్‌తో కలిసి విడుదల చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నిదర్శనం వీడియో విడు

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (16:36 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నటి తాప్సీ పన్ను ఓ వీడియోను విడుదల చేసింది. మహో మహిళ స్వర భాస్కర్‌తో కలిసి విడుదల చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నిదర్శనం వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 1.56 లక్షల మందికి పైగా వీక్షించారు. దీనికి కారణం మహిళలు క్లీవేజ్‌ను ఎలా మేనేజ్ చేయాలో వివరిస్తూ.. కొన్ని టిప్స్ చెప్పారు. ఫలితంగా ఈ వీడియో వైరల్‌గా మారింది. 
 
ఇటీవలికాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం వారు ధరిస్తున్న దుస్తులే కారణమంటూ కొందరు మగాళ్లు చేస్తున్న కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఎంతవరకు క్లీవేజ్ ఉంటే అది క్లీవేజ్ అవుతుంది’’ అని నిలదీశారు. వీరికి గట్టిగా కౌంటరిస్తూనే... మహిళలు తమ క్లీవేజ్ అందాలను ఎలా మేనేజ్ చేయాలో కొన్ని టిప్స్ చెప్పారు. 
 
వీడియో ప్రారంభంలో ఏదో స్టయిల్ టిప్స్ చెబుతున్నారులే అన్నట్టు భావిస్తాం. చివరికొచ్చే సరికి ఈ వ్యంగ్యాస్త్రం వెనుకున్న సందేశం సంభ్రమాశ్చానికి గురిచేస్తుంది. ఇందులో కొంత భాగం బ్లాక్ అండ్ వైట్.. మిగతా సగం కలర్ వీడియో కనిపిస్తుంది. ఆడపిల్లలు ఎంతనిండుగా దుస్తులు ధరిస్తే ఆగడాలు ఆగుతాయో, క్లీవేజ్‌ను ఎలా ‘మేనేజ్’ చేయాలో చెబుతూ వీరిద్దరూ ఛలోక్తులు విసిరారు. 
 
‘‘ఆఫీసులో ఉన్నప్పుడు.. మెడవరకు ఎత్తుగా ఉండే దుస్తులు ధరించండి’’ అని స్వర అంటే.. ‘‘మీకు ఊపిరి ఆడనంతగా’’ అని వెంటనే తాప్సీ సైటైర్ వినిపిస్తుంది. ఇలా రోడ్డుపై నడిచేటప్పుడు, క్లబ్బులు, పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు ఎంత నిండుగా దుస్తులు ధరించాలో వ్యంగ్యంగా పేర్కొన్నారు. ‘‘హౌ మచ్ క్లీవేజ్ ఈజ్ గుడ్ క్లీవేజ్’’ అంటూ వీరు షేర్ చేసుకున్న వీడియో మధ్యాహ్నానికల్లా 1.56 లక్షల మందికి పైగా వీక్షించారు. నిర్మొహమాటంగా మాట్లాడుతూ మహిళల్లో స్ఫూర్తినింపేందుకు వీరు చేసిన ప్రయత్నానికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను రూపొందించారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments