Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ రవి - శ్రీముఖిలకు చెప్పు దెబ్బలు తప్పవు : నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్

బుల్లితెర యాంకర్ రవి, శ్రీముఖిలకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చింది. వారిద్దరు బయట కనిపిస్తే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించింది. ఇలాంటి హెచ్చరిక చేయడానికి గల కారణాలను

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (15:28 IST)
బుల్లితెర యాంకర్ రవి, శ్రీముఖిలకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చింది. వారిద్దరు బయట కనిపిస్తే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించింది. ఇలాంటి హెచ్చరిక చేయడానికి గల కారణాలను పరిశీలిస్తే... 
 
నిరంతరం వివాదాల్లో నలుగుతుండేవారిలో యాంకర్ల శ్రీముఖి, రవిలు కూడా ఉన్నారు. ఇటీవల ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో నర్సులను కించపరిచేలా వారిద్దరూ కామెంట్స్ చేశారట. ఆ వ్యాఖ్యలు చేసినందుకుగానూ హైదరాబాద్‌ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. 
 
ఈ వ్యవహారంపై ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సుష్మిత స్పందిస్తూ పగలనక, రాత్రనక రోగులకు ఎంతో సేవ చేసే నర్సులపై యాంకర్ రవి, శ్రీముఖిలు అతి దారుణంగా కామెంట్ చేశారని మండిపడ్డారు. వాళ్లకు వేలెత్తి చూపే పొజిషిన్‌లో ఉన్నాం కానీ.. వారితో చెప్పించుకునే దీనస్థితిలో తాము లేమని తేల్చి చెప్పింది. 
 
యాంకర్ రవి, శ్రీముఖి, ప్రోగ్రాం చేసిన ఆ వ్యక్తులు ఎప్పుడూ హాస్పిటల్‌కు వెళ్లలేదా?, తమ కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తీసుకెళ్లి నర్సులతో సేవలు చేయించుకోలేదా? అని ఆమె నిలదీశారు. అంతేకాకుండా, బూతు పురాణం అందుకుంది. వారిద్దరు బయటకొస్తే ప్రతి ఒక్క నర్సు చెప్పు తీసుకొని కొడుతుందని ఆమె హెచ్చరించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments