Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు అడగాలేగానీ.. నా ప్రాణమైనా ఇచ్చేస్తా... తమ్ముడుపై అన్నయ్య ప్రేమ

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (11:45 IST)
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా వాయిదాపడింది. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది  బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. ఇది కూడా కరోనా కారణంగా వాయిదాపడింది. పైగా, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. దీంతి సినీ సెలెబ్రిటీలంతా తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. 
 
ఇదిలావుంటే, ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆచార్య చిత్రం తర్వాత చిరంజీవి మలయాళ చిత్రం లూసీఫర్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం హక్కులను ఆయన తనయుడు, హీరో కొనుగోలు చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రంలో మోహన్ లాల్, పృథ్విరాజ్ నటించారు. తెలుగులో చిరంజీవి - రాంచరణ్ కలిసినటిస్తారన్న ప్రచారం సాగుతోంది. 
 
అయితే, తాజా సమాచారం మేరకు.. చిరంజీవి ఈ కథను తన సోదరుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. అదీ కూడా పవన్ అడిగితే ఈ చిత్ర రైట్స్ ఇచ్చేందుకు సిద్ధమని చిరంజీవి తాజాగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. అదే జరిగితే పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్‌లు కలిసి ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
అయితే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే పవన్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయ్యివున్నారు. ఇందులో మొదటది వకీల్ సాబ్ చిత్రంకాగా, ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి, ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు సమ్మతించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments