Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ గంగవ్వ హెల్త్ ఎలా ఉంది..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (18:38 IST)
అరవై ఏళ్ల వయసులో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించింది గంగవ్వ. బిగ్ బాస్ అనగానే ఇప్పుడు అందరూ గంగవ్వ పేరే చెబుతున్నారు. అంతలా.. అందర్నీ ఆకట్టుకుంది. ఎప్పుడైతే... గంగవ్వ బిగ్ బాస్ షోలో పాల్గొంటుందని తెలిసిందో అప్పటి నుంచి గంగవ్వ గెలవాలి అని అందరూ మనస్పూర్తిగా కోరుకున్నారు.
 
సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టారు. ఆమెకు లభించిన ఆదరణ చూస్తే... ఈసారి బిగ్ బాస్ టైటిల్ గంగవ్వ గెలుచుకుంటుంది అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా ఆమెకు ఆరోగ్య సమస్యలు రావడం... అక్కడ ఉన్న వారితో అంతగా కలవలేకపోవడంతో ఇంటికి పంపించేయండి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
 
గంగవ్వ పరిస్థితిని చూసిన వీక్షకులు కూడా ఆమెను ఇంటికి పంపిచేయడమే బెటర్ అనుకున్నారు. అంతలా.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఉంది. గంగవ్వ పరిస్థితిని అర్ధం చేసుకున్న బిగ్ బాస్ ఆమెను హౌస్ నుంచి ఇంటికి పంపించేసారు. అయితే... ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం గురించి చాలా మందిలో కాస్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
 
అయితే.. అంతలా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదని తెలిసింది. గంగవ్వ ఆరోగ్యంగానే ఉన్నారు. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. 
 
గంగవ్వ గురించి నాగార్జున మాట్లాడుతూ... గంగవ్వా... నువ్వు ఏదైతే ఆశించి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చావో ఆ కోరిక తీరుస్తా అన్నారు. ఆమె కోరిక ఏంటంటారా..? ఇల్లు. నాగార్జున ఆమెకు ఇల్లు కట్టిస్తానని చెప్పారు. హ్యాపీగా ఇంటికి వెళ్లాలని అన్నారు. అదీ.. సంగతి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments